కమీషన్ల కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపితే ఉపేక్షించేది లేదు
జిల్లా కలెక్టర్ కే శశాంక
(మహబూబాబాద్- విజయం న్యూస్)
కమీషన్ల కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపితే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం గూడూరు మండల కేంద్రం, అయోధ్య పురం లోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ఆకస్మిక తనిఖీ చేశారు.కనీసం బోర్డు, బ్యానర్ , రైతు షెడ్డు, టెంట్లు, కనీస వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్యాడి క్లీనర్లు లేకపోవడం, ఫ్యాన్లు ఆమర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఐకేపీ ద్వారా నిర్వహించే కొనుగోలు కేంద్రాలు 70 అయినప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడం, సెంటర్ ఇన్ ఛార్జీలను, సి సి ని మందలించారు.
also read :-ఓ ప్రేమ వివాహం .. ఇరు కుటుంబాల మధ్య చిచ్చు…
గూడూరు ఐకేపీ ని ఫ్యాక్స్ కు అప్పగించాలని, కొనుగోలు కేంద్రం ఇన్చార్జిలు రిజిస్టర్ లో ఫార్మాట్ ప్రకారం క్రమపద్ధతిలో రైతులు తీసుకొచ్చిన ప్రకారం నమోదు చేయాలని, మీరు రిసిప్ట్ లు ఇవ్వాలని సుమారు30 టార్పాలిన్లు ఉండాలని ఆదేశించినప్పటికీ తక్కువ ఉండటం ఏమిటని, ట్రక్ షీట్ వెంటనే అప్లోడ్ చేయాలని,అరైవల్ రిజిస్టర్ ను పరిశీలించి ధాన్యాన్ని ఎవరు ఎప్పుడు తీసుకు వచ్చారని, తేమ శాతాన్ని పరిశీలించారు. శిక్షణ ఇచ్చి ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించుటపై ఉపేక్షించేది లేదని, మండల స్థాయి సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. అయోధ్య పురం లో 79 మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు రాగా 62 మంది రైతుల ధాన్యం కాంటా వేయడం జరిగిందని, 30 మందికి డేటా అయిందని 6 లారీలు 4 ట్రాక్టర్లు లోడ్ చేసి పంపినట్లు అధికారులు తెలిపారు.
also read;-బీరు సీసాలతో కొట్టి.. టీఆర్ఎస్ నాయకుడి హత్యకు యత్నం
ధాన్యం తీసుకువచ్చే రైతులకు సౌకర్యాలు కల్పించాలని, ప్యాడి సెంటర్ నుంచి త్వరగా ధాన్యం వెళ్లేందుకు తగు చర్యలు చేపట్టాలని, అవసరం మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, తేమ శాతాన్ని పరీక్షించి వెంటనే కాంట అయ్యేట్లు చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి డిడి దిలీప్ కుమార్, డి ఎస్ ఓ నర్సింగ్ రావు, డి ఎం మహేందర్, తహసిల్దార్ అశోక్ కుమార్ ఎంపీడీవో విజయలక్ష్మి సర్పంచ్ రమేష్, ఐ కె పి సి సి, సెంటర్ ఇంచార్జి సునీత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.