Telugu News

‘టీఆర్ఎస్’ కాదు.. ఇక ‘బీఆర్ఎస్’

రేపు మధ్యాహ్నం 1.20 గంటలకు అవిర్భావ

0

‘టీఆర్ఎస్’ కాదు.. ఇక ‘బీఆర్ఎస్’

== ఆమోద ముద్ర వేసిన కేంద్ర ఎన్నికల సంఘం

== సీఎం కేసీఆర్ కు లేఖలో స్పష్టం చేస్తూ ఇంటికి పంపించిన ఈసీ

== రేపు మధ్యాహ్నం 1.20 గంటలకు అవిర్భావ

==  జెండా ఎగరవేయనున్న సీఎం కేసీఆర్

== రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయనున్న గులాబీ శ్రేణులు

(హైదరాబాద్-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం కోసం ఏర్పాటైన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ రేపటి నుంచి ‘భారత్ రాష్ట్ర  సమితి’ గా మారనుంది.. అందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి అమోద ముద్ర వేసింది..జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ గతేడాది నుంచి ప్రయత్నం చేస్తుండగా ఈ ఏడాది అక్టోబర్ 5న బీఆర్ఎస్ పార్టీని ప్రకటించి, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖను రాశారు.

allso read- ఆమ్ ఆద్మీ పార్టీకి  జాతీయ హోదా: మనీశ్ సిసోడియా

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ జాతీయ పార్టీగా అవిర్భవించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన పరిస్థితి మనందరికి తెలిసిందే. దీంతో నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం అభ్యంతరాలు రాకపోవడంతో సీఈసీ బీఆర్ఎస్ పార్టీకి ఆమోద ముద్రవేస్తూ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు లేఖను పంపించారు. బీఆర్ఎస్ పార్టీగా కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చని ఆ లేఖలో చెప్పింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఇక పుల్ స్టాఫ్ పడనుంది.

== రేపు మధ్యాహ్నంమే అవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర  సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆ పేరుకు ఆమోద ముద్ర వేయడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.. ఆ ప్రకటన రావడమే ఆలస్యం రాష్ట్ర వ్యాప్తంగాపార్టీ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ స్పందించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే పార్టీ అవిర్భావ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.

allso read- గుజరాత్‌లో బీజేపీదే హవ్వా

ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు సుముహుర్తానా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థానంలో జెండాను ఎగరవేయనున్నారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అందుకు గాను పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, మంత్రులు హారీష్ రావు,శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహ్ముమద్ అలీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర మంత్రులు పార్టీ కార్యాలయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

== రేపు ఊరూరా అవిర్భావ సంబరాలు

భారత రాష్ట్ర సమితి పార్టీ అవీర్భావ వేడుకలను ఊరూరా జరుపుకునేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్దమైయ్యారు. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ పార్టీ జెండా అవిష్కరించిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పార్టీ అవిర్భావ వేడుకలను జరుపుకోవాలని పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి కూడా అన్ని జిల్లాలకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

== హైదరాబాద్ కు రావాలని పిలుపు            allso read- డిసెంబర్ 15 నాటికి  ‘రైతుబంధు’: సీఎం కేసీఆర్

జాతీయ పార్టీ అవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.