Telugu News

దేశంలో 6వ దశ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదల

7రాష్ట్రాల్లోని 57నియోజకవర్గాలకు నోటిఫికేషన్ 

0

దేశంలో 6వ దశ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదల

== 7రాష్ట్రాల్లోని 57నియోజకవర్గాలకు నోటిఫికేషన్ 

== మే 25న పోలింగ్ 

(న్యూఢిల్లీ -విజయం న్యూస్)

భారతదేశంలో దశలవారిగా  పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదోవ విడత  ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, సోమవారం ఆరవ విడత ఎన్నికలకు జాతీయ ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ విడుదల చేశారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన  దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ ఇవాళ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు మే 25 న పోలింగ్‌ నిర్వహించనన్నుట్లు అధికారులు వివరించారు.
బీహార్‌లో 8, హర్యానాలో 10, జార్ఖండ్‌ లో 4, ఒడిశాలో 6, ఉత్తర్‌ ప్రదేశ్‌ లో 14, పశ్చిమ బెంగాల్ లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. సోమవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.