Telugu News

ఎన్ఎస్పీ రోడ్డులో డెంజర్..

ప్రమాదకరంగా మారిన సైడ్ డ్రైనేజీ...

0

ఎన్ఎస్పీ రోడ్డులో డెంజర్..

ప్రమాదకరంగా మారిన సైడ్ డ్రైనేజీ…
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం నూతన బస్టాండ్ నుంచి ఎన్ఎస్పీ క్యాంపుకు వచ్చే రోడ్ మూలమలపు వద్ద వున్న సైడ్ డ్రైనేజీ అత్యంత ప్రమాదకరంగా వున్నదని వెంటనే టీఆర్ఎస్ పాలకవర్గం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు డ్రైనేజీను పరిశీలన చేశారు ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డులో నూతన బస్టాండ్ రావడంతో ఎన్ఎస్పీ క్యాంపు రహదారి మీదు ట్రాఫిక్ బాగా పెరిగింది అని దినితో డ్రైనేజీ వద్ద పలు సార్లు టూ వీలర్ వాహనదారులు ఏక్సిడెంట్ కు గురువయ్యారు అని తెలిపారు

బైపాస్ బంకు వద్ద వున్న ఈ సైడ్ డ్రైనేజీ బాగా లోతుగా వుండటం వల్ల అత్యంత ప్రమాదకరంగా వున్నదని తెలిపారు . సదరు కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ ఇబ్బందులు తలెత్తుతాయి అని ఆరోపించారు . TRS కార్పొరేటర్లు కూడా రహదారుల డ్రైనేజీ నాణ్యతలపై దృష్టి పెట్టడం లేదు అని విమర్శించారు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ సెక్రటరీ బోడపట్ల సుదర్శన్ , జె వెంకన్న బాబు, కె వెంకన్న, పి వాసు, ఎస్ రవీంద్రర్ , నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

also read:-ముదిగొండ కాంగ్రెస్ ఫ్లీనరీ.. హాజరైన సీఎల్పీ నేత భట్టి..