ఎన్టీఆర్ అందరివాడు,దయచేసి రాజకీయం చేయకండి
విలేకర్ల సమావేశంలో విగ్రహ ప్రతిష్ట కమిటీ బాద్యులు దొడ్డా రవి,శిల్పి ప్రతాప్ వర్మ
ఎన్టీఆర్ అందరివాడు,దయచేసి రాజకీయం చేయకండి
== కోర్టు అనుమతితోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని అవిష్కరిస్తాం
== ట్యాంక్ బండ్ బ్యూటీఫికేషన్ కోసం మాత్రమే విగ్రహ నిర్మాణం
== విలేకర్ల సమావేశంలో విగ్రహ ప్రతిష్ట కమిటీ బాద్యులు దొడ్డా రవి,శిల్పి ప్రతాప్ వర్మ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
నందమూరి తారకరామారావు అందరివాడు అని, ఆయన విగ్రహం ఏర్పాటు మనందరి బాధ్యతగా భావించి సహాకరించాలని, దయచేసి ఈ అంశంపై రాజకీయం చేయోద్దని విగ్రహ ప్రతిష్ట కమిటీ బాద్యులు దొడ్డా రవి,శిల్పి ప్రతాప్ వర్మ కోరారు. శుక్రవారం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఆశాజ్యోతి, అందరివాడని అన్నారు. ఆయనకు అభిమానులు లక్షల్లో ఉంటారని, ఆయన అభిమానుల కోసం, ఆయనపై ఉన్న అభిమానం కోసం, లకారం ట్యాంక్ బండ్ బ్యూటిషన్ కోసం మాత్రమే విగ్రహాన్ని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అంతేకాని ఇందులో ఏలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు.
allso read- ఖమ్మం లో సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.
ఎవరి మనోభావాలను బాధపెట్టాలనే ఆలోచన లేదని, ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణంలో మార్పులు చేసి కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని హామినిచ్చారు. కృష్ణుడి పోలికలు ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో స్వల్ప మార్పులు చేసి విగ్రహాన్ని అవిష్కరిస్తామన్నారు. అభ్యంతరం లేకుండ నెమలి పింఛం,పిల్లనగ్రోవి తొలగిస్తున్నామని, రాజకీయాలకు,ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధం లేదన్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై కొందరు రాజకీయం చేయడం బాధాకరమన్నారు. మంత్రి అజయ్ కుమార్ కూడా ఇందులో డోనర్ మాత్రమేనని అన్నారు. అన్ని సామజిక వర్గాల నుంచి స్వచ్చందంగా డోనర్లు ముందుకు వచ్చారని తెలిపారు. విగ్రహ అవిష్కరణలో కేవలం డోనర్లను మాత్రమే ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేదని, మీడియా తో మాట్లాడిన విగ్రహ ప్రతిష్ట కమిటీ బాద్యులు దొడ్డా రవి,శిల్పి ప్రతాప్ వర్మ, పాల్గొన్న కర్నాటి కృష్ణ,కూరకుల వలరాజు,డోన్ వాన్ రవి,పసుమర్తి రామ్మోహన్,బత్తినేని నాగ ప్రసాద్,జస్వంత్,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
allso read- ఎన్టీఆర్ విగ్రహంపై పాలి‘ట్రిక్స్’