Telugu News

మాకు రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆర్ : కేటీఆర్

నాకు ఆయన పేరు ఉండటం సంతోషంగా ఉంది

0

మాకు రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆర్ : కేటీఆర్

== రాష్ట్ర ప్రజల్లో ఎన్టీఆర్ స్థానం పదిలం

== నాకు ఆయన పేరు ఉండటం సంతోషంగా ఉంది

== జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అసక్తికర వ్యాఖ్యలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలుగు ప్రజలందరికి ఆరాద్య దైవంగా కొలవబడే ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు. ఆనాడు రాముడు ఎవరో, క్రిష్ణుడంటే ఎవరో ఎవరికి తెలియదు.. రాముడ్ని, క్రిష్ణుడ్ని ఎన్టీఆర్ లోనే చూసుకున్నాం. మాకు రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆర్ మాత్రమేనని, ఆయన పేరు నాకు ఉండటం చాలా సంతోషమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట తారకరామారావు అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఖమ్మం లకారం టాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ ను మంత్రులు కేటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ గెలుపే అభివద్దికి మలుపు: మంత్రి కేటీఆర్

▪️రూ.10 కోట్లతో చెపట్టినున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.  రూ.2.49 కోట్లతో నిర్మించనున్న అమృత్ 2.0 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20వ డివిజన్ ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాల రోడ్ నందు మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో రూ.71 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు మాకు రాముడైన, కృష్ణుడైన ఆయనే. తెలుగు వారంటూ ఉన్నారు. భారత దేశంలో అంటే వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్. చరిత్రలో మహనీయుల స్థానం అజరామనీయం అందులో ఎన్టీఆర్ స్థానం పదిలం. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. మంత్రి పువ్వాడ కు ధన్యవాదాలు. నాకు తారక రామారావు అనే పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదు, అన్న ఎన్ టీ ఆర్ కూడా కొట్టలేదు.. అది సీఎం కెసీఆర్ కి  సాధ్యమవుతుందని అన్నారు.

ఇది కూడా చదవండి: దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌: మంత్రి పువ్వాడ