Telugu News

దేశం గర్వించ నాయకుడు ఎన్టీఆర్ : నామా

ఎన్ టీ ఆర్ జయంతి సందర్భంగా నామ నాగేశ్వరరావు ఘన నివాళి

0

పుడమి ఉన్నన్నాళ్లు ఎన్ఠీఆర్ జీవించే ఉంటారు: నామా

➡️ *సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్ టీ ఆర్

➡️ *ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు ఎన్ఠీఆర్

➡️ *దేశం గర్వించ నాయకుడు ఎన్టీఆర్ 

➡️ *ఎన్ఠీఆర్ స్పూర్తితో కేసీఆర్ సుపరిపాలన

👉 *ఎన్ టీ ఆర్ జయంతి సందర్భంగా నామ నాగేశ్వరరావు ఘన నివాళి

ఖమ్మం, మే 27(విజయం న్యూస్):

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)
పుడమి ఉన్నంత కాలం ఎన్ఠీఆర్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే ఉంటుందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొంటూ ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళ్ళర్పించారు. ఈ మేరకు నామ సోమవారం ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారని, ఎన్ఠీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.. చరిత్ర గర్వించదగ్గ మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరని, పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారని తెలిపారు. దేశంలో సంక్షేమపాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని కొనియాడారు.. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాదన్నారు.. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని, పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలని నామ నాగేశ్వరరావు అన్నారు. పేదలకు రేషన్ ద్వారా పట్టెడన్నం పెట్టేందుకు కిలో రూపాయి బియ్యం పధకం ప్రవేశపెట్టారని అన్నారు. కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పాలన అందించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం నినాదంతో కోట్లాది మంది పేదల హృదయాల్లో గూడు కట్టుకున్న ఎన్ఠీఆర్ చిరస్మనీయుడని అన్నారు.కేసీఆర్ కూడా ఎన్ఠీఆర్ స్పూర్తితో పాలన అందించారని అన్నారు. ఎన్ఠీఆర్ సూర్తితో నే రైతు బంధు, రైతు భీమా, ఉచిత కరెంట్, పేదలకు , వికలాంగులకు పెన్షన్ ఇచ్చారని చెప్పారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరడంతో పాటు లేఖలు రాయడం జరిగిందని చెప్పారు. ఎన్ఠీఆర్ మాదిరిగానే కేసీఆర్ సంక్షేమ పాలన అందించి, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేసి, దేశానికే దిక్చూచిగా చేశారని నామ నాగేశ్వరరావు అన్నారు.