Telugu News

బీజేపీ పాలేరు అభ్యర్థి కోసం  నున్నా రవి  దరఖాస్తు

0

బీజేపీ పాలేరు అభ్యర్థి కోసం  నున్నా రవి  దరఖాస్తు

(కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజవర్గం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మం జిల్లా జనరల్ సెక్రెటరీ నున్నా రవికుమార్ దరఖాస్తు చేశారు. హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంకు ప్రత్యేక వాహానాల్లో బయలుదేరి వెళ్లిన నున్నా రవికుమార్ శుక్రవారం రాష్ట్ర పార్టీ ఇంచార్ట్ కు  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా సహఇన్చార్జ్ సరి కొండ విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ  పాలేరు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజల నెత్తిని కొట్టి రాజ్యమేలుతున్నారని, అడిగితే బెదిరించే పరిస్థితి ఉందని, కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజ్యంగ చట్టం ప్రకారం ఎన్నికైన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రాజ్యంగానికి తూట్లు పొడిచి పార్టీ మారి ఆయన్ను నమ్మిన వారి గొంతు కోసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని, ఆయన్ను ఓడిస్తే భవిష్యత్ లో అలాంటి పరిస్థితులు రావని పిలుపునిచ్చారు. పాలేరు నియోకజవర్గలో కాంగ్రెస్ కు ఇక అవకాశం లేదని, రాబోయే బీజేపీ ప్రభుత్వమేనని, పాలేరులో ఎగిరేది కూడా బీజేపీ జెండానే అని అన్నారు.  నేను మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకొని మీ ముందుకు రాబోతున్నానని తెలిపారు. నాతో చేతులు కలపండి.. నన్ను ఆశీర్వదించండి అని ప్రజలను వేడుకున్నారు.

allso read- ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?