Telugu News

ఓ నేత.. కార్యకర్త గోస వినవా..?

ఎడిటోరియల్ బై అంజయ్య

0

ఓ నేత.. కార్యకర్త గోస వినవా..?

 == ఎడిటోరియల్ బై అంజయ్య

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలమైన పార్టీ.. గడిచిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కడ ఆ పార్టీ  తగ్గలేదు.. కమ్యూనిస్టుల బలంగా ఉన్న నాటి నుంచి తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీ  ప్రభుత్వాల పరిపాలన వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన హవ్వా కొనసాగించుకుంటూ వస్తూనే ఉంది. 2014 లో కొన్ని పార్టీలతో కలిసి 9 స్థానాలను గెలిచిన కాంగ్రెస్ పార్టీ, 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా 9 స్థానాలను కైవసం చేసుకుంది.. అధికార పార్టీ గాలి వీస్తున్న సందర్భంలో, వన్ సైడ్ ఫలితాలు వస్తున్నప్పటికి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంది..

ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

రెండు దఫాలుగా తెలుగుదేశం, రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలిస్తున్నప్పటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మాత్రం ఎదరలేదు..బెదరలేదు.. అనుకున్న స్థానాలను గెలిచి  ఖమ్మం ఖిల్లా కాంగ్రెస్ జిల్లాగా  నిలబడింది..

రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తోందనడంలో సందేహం లేకపోవచ్చు.. అందులో భాగంగానే  కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది..  జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.. జనబలం కల్గిన నాయకులతో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులను కూడా కాంగ్రెస్ వైపు లాక్కునేందుకు ప్రయత్నం చేస్తోంది.. ఎప్పుడు చూడని విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అడుగు తగ్గి నేతల వద్దకు వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామాలంటూ రాజకీయ విశ్లేషుకులు సైతం మెచ్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో అభయ ‘హస్తం’ ఎవరికో..

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నాయకులు భట్టి విక్రమార్క, రేణుక చౌదరి, సంభాని చంద్రశేఖర్ లాంటి సీనియర్ నాయకులు కూడా అడుగు వెనక్కి తగ్గి ఇతర పార్టీలో ఉన్న అసమత్తులను నేరుగా కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు లేవు. గతంలో ఎవరైనా కాంగ్రెస్ లో చేరాలంటే,  వారే నేరుగా ముఖ్యనాయకులకు పోన్ చేస్తే తప్ప కాంగ్రెస్ అగ్రనేతలు స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి అడుగు వెనక్కి తగ్గి నాలుగు మెట్లు దిగి పార్టీ వైపు ఆలోచన ఉందాని తెలవగానే వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించడం రాజకీయ పెనుమార్పులకు ఇదో నాంధిగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కు ఇదో మంచి శుభసూచకమే అనిపిస్తోంది..

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నదేవరంటే..?

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు ఉంటూనే ఉంటుంది.. 137 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేని  ఊరు లేదు.. కొట్లాడని రోజు లేదు.. ఎవరో ఒక నాయకుడు ఆయా జిల్లాలో వర్గాన్ని క్రియేట్ చేసుకుని పార్టీని, పార్టీ నాయకులను తిడుతూనే ఉంటారు.. అవసరమైతే కొట్టుకుంటారు.. తన్నుకుంటారు.. బహిరంగంగానే తిట్టుకుంటారు.. కానీ ఎన్నికల నాటికి ఒక గూటిపక్షులా అందరు ఒకే దగ్గరుకు చేరుకుని కాంగ్రెస్ పార్టిని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తారు.. ఇది కాంగ్రెస్ పార్టీకి సర్వసాధారణమైంది.. అంతేకాకుండా ఇది ఆ పార్టీకి బలమైంది కూడా.. వేరే పార్టీలో అలాంటి పరిస్థితి ఉండదు. వర్గమేర్పడిందంటే ఆ నాయకుడ్ని ఓడించే వరకు పోరాటం చేస్తారు.. లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోతారు.. కానీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఎన్ని వర్గాలున్న పార్టీని మాత్రం వీడరు.. పదవుల కోసం వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలిచిన వారో, ఓడిన వారో, పదవులను అనుభవించిన వారో, పార్టీ పేరుతో సంపాధించుకున్న వారో, ఎక్కడ పార్టీ మారకపోతే దొరికిపోతామేమో అనే భయంతో ఉన్నవారో పార్టీని వీడారే తప్ప. పార్టీ జెండాను మోసిన వారు మాత్రం నేటికి ఆ జెండాను పట్టుకునే ఉన్నాడు. అది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ బలం.  అందుకు ఉదాహారణే గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే  బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్నే చూపించుకోవచ్చు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాజీ మంత్రి జనబలం కల్గిన నేత తుమ్మల నాగేశ్వరరావుపై గెలిపించారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను సీనియర్ ఎమ్మెల్యేపై గెలిపించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మూడు సార్లు పార్టీ మారడంతో పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు కుమారుడు, తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకట్రావ్ పై గెలిపించారు.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ సీనియర్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై గెలిపించారు. ఇలాంటి శక్తులపై వాళ్లను గెలిపించినప్పటికి పార్టీ కార్యకర్తలకు తెలియకుండా, చెప్పకుండా పార్టీ మారారు.. అయినప్పటికి  వారు పార్టీని వీడి వెళ్లిపోయినప్పటికి వారితో ఒక్కరంటే ఒక్కరు పార్టీ మారకపోవడం గమనర్హం. ఇది నిజంగా కాంగ్రెస్ గొప్పతనం.  వాళ్లతో పోయిన వారు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, తిరిగి మళ్లీ అదే పార్టీలోకి వెళ్ళిన వారే తప్ప, కాంగ్రెస్ జెండాను పట్టుకుని నడిచే ఏ కార్యకర్త, నాయకుడు కూడా పార్టీ మారలేదంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎంత బలంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆ కార్యకర్త బుల్డోజర్ పెట్టి నెట్టిన, పదిలక్షలు ప్యాకేజీ ఇచ్చిన  ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం లేకపోవచ్చు..

ఇది చదవండి:- ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్

      పదేళ్ల పాటు ప్రభుత్వం లేదు.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. కష్టపడి తిరిగేవారిపై నిఘా పెట్టి బెదిరింపులకు దిగుతున్నారు.. రోడ్డేక్కిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే భయపడే పరిస్థితి.. పార్టీ మారకపోతే మీ సంగతి చూస్తామని అనేక చోట్ల బెదిరిస్తున్నారు. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ పార్టీని వీడకుండా కేసుల పాలైనప్పటికి జెండాను వీడకుండా ఉంటున్నారంటే ఆ పార్టీ ఎంత బలమైందో తెలుసుకోవచ్చు.. ఇంతటి కష్టసమయంలో కూడా కార్యకర్తలు పార్టీని అంటిబెట్టుకుని ఉన్నారు.. ఒక మాట చెప్పాలంటే… ఇప్పటికి ఆయా నియోజకవర్గాలో కార్యకర్తలను కాపాడే నాయకుడు లేడు. సహాయం చేసే నాయకుడు లేడు.. పేపర్ పులులు తప్ప.. కార్యకర్తను ఆదుకుందామని ఆలోచించే వారే కరువైయ్యారు. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు వదలడం లేదు. కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మారారు.. సరిహద్దులో సైనికుడు తుపాకి పట్టి దేశాన్ని ఎలా కాపాడుకుంటాడో.. కాంగ్రెస్ కార్యకర్త కూడా జెండా చేతబట్టి కాపాడుకుంటున్నాడనడంలో సందేహమే లేదు.

కానీ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు రావడం లేదు.. మండల,గ్రామ కమిటీలు లేవు.. గ్రామస్థాయిలో నిర్మాణం లేదు.. గ్రామాల్లో బలమైన నాయకుడు లేడు. కార్యకర్తలను కాపాడే వారు లేరు.. పార్టీని నడిపించే నాయకుడ్ని తయారు చేయడం లేదు..ఏ పాటికి పార్టీ బలంగా ఉంది.. గెలుస్తాం అని చెప్పుకోవడమే తప్ప.. ఏ నాడు గ్రామాల్లో నాయకులేవ్వరు ఉన్నారు.. ఎవరు పనిచేస్తున్నారు..? కాంగ్రెస్ సర్పంచ్ ఎవరు.. ఎంపీటీసీ ఎవరు. గ్రామ శాఖలు ఉన్నాయా..?లేవా..? నూతన మండల కమిటీ ఏర్పాటు కాక ఎన్నాళ్లైంది. కార్యకర్తల బాధలేంటి అని ఆలోచించే వారే కరువైయ్యారు. మైకులు తీసుకుని ముచ్చట్లు చెప్పమంటే గుండెల్లో పాలు తీసి చేతిలో పోస్తున్నట్లు, లడ్డు తీసి నోట్లో పెట్టినట్లు మాట్లాడతారు.. ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ మేలుకోకపోతే.. నేతల్లో మార్పులు రాకపోతే.. మండల, గ్రామస్థాయిలో పార్టీని నిర్మాణం చేయపోతే కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మిని జమలి ఎన్నికలు వచ్చే చాన్స్ ఉంది కాబట్టి మే నెలలో ఎన్నికలు ఉండోచ్చు.. అంటే సుమారు 8నెలల సమయం ఉన్న ఈ తరుణంలో నాయకులు గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదనేది జనాభిప్రాయం. మరీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం ఈ విధంగా ఆలోచిస్తుందా..? ఎప్పటి లాగే ఇప్పుడు వదిలేసి చేతులు కాల్చుకుంటుందా..? చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేమి ఉంటుంది.. నాయక.. మేలుకో.. కాంగ్రెస్ సైనికుడ్ని కాపాడుకో..? జై హింద్..