Telugu News

ఓ పిట్ట కథ షాట్ ఫిల్మ్ టీజర్ విడుదల

అందరు జీళ్ళచెరువుకు చెందిన యువకులే

0

ఓ పిట్ట కథ షాట్ ఫిల్మ్ టీజర్ విడుదల
== అందరు జీళ్ళచెరువుకు చెందిన యువకులే
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామానికి చెందిన కొందరు యువకులు షాట్ ఫిల్మ్ తీశారు. సమాజానికి స్పూర్తిని చ్చే కథతో వారు ఫిల్మ్ తీసి ఒక మేసేజీ ఇవ్వబోతున్నారు. జీళ్ళచేరువు గ్రామానికి చెందిన చింతలపాటి శ్రీకాంత్ హీరో, డైరెక్టర్ ఐతగాని వెంకటేష్, కెమెరామెన్ గా, మస్తాన్, వెంకటేష్, మహేష్ సహాయకులు గా తరుణ్, నరేష్ మున్నా,
ఐతగాని గోపాలకృష్ణ లు తెరకేక్కించిని షాట్ ఫిల్మ్ ‘ఓ పిట్ట కథ’. ఇందులో హీరోయిన్ గా దివ్య నటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ షాట్ ఫిల్ ను తీసినట్లు హీరో శ్రీకాంత్ తెలిపారు.

also read :-మన ఊరు -మన బడి`కోసం రూ.7,289 కోట్లు విడుదల : మంత్రి హారీష్ రావు

చాలా ఖర్చు చేసి ఈ ఫిల్మ్ తీశామని, యువకులు ప్రేమ పేరుతో పడుతున్న ఇబ్బందులు, కుటుంబాల్లో వస్తున్న సమస్యలను బేస్ గా చేసుకుని ఈ షాట్ ఫిల్మ్ ను రూపొందించినట్లు తెలపారు. అతి త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. నటినటులతో పాటు డైరెక్టర్, కెమోరామెన్ తో పాటు సిబ్బంద కూడా ఒక ఊరివాళ్లమేనని తెలిపారు. చిన్న మెదడులో మొదలైన ఈ బాట ఇక ముందుకు వెళ్లుందని భావిస్తున్నట్లు తెలిపారు. సినిమాలపై మక్కువతో సమాజానికి ఒక సమాచారం ఇవ్వాలనే ఆలోచనతో షాట్ ఫిల్మ్ తీసినట్లు ఆయన తెలిపారు.
== టీజర్ విడుదల
ఓ పిట్ట కథ పిల్మ్ టీజర్ ను డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, జీళ్ళచెరువు సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ అంబాల ఉమ శ్రీనివాస్, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డు నరేందర్ బుధవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేందుకు మా ఊరి యువకులు తీసిన ఈ ఫిల్మ్ సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐతగాని చిన్ననరసింహ రావు, ఐతగాని రాంగోపాల్, గుద్దటి బిసు,కుమ్మరికుంట్ల వీరబాబు, బి. రమేష్, కె.వెంకన్న, చిన్న వీరబాబు,నాయిని బాలు వీరేందర్, గంటా ప్రభాకర్, కత్తి వినయ్,కొండ వీరబాబు,బొమ్మగాని లాలయ్య, ముద్రబోయిన నర్సయ్య, మొక్క వీరబాబు,అంబాల శరత్, గోపి శేఖర్, ఐతగాని ఉపేందర్, అర్జున్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.