Telugu News

మనస్తాపంతో విద్యార్ధిని ఆత్మహత్య.

ఇచ్చోడ మండలం లోని తలమద్రి గ్రామంలో తిని తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి ఇచ్చోడ మండలం లో జరిగింది

0

మనస్తాపంతో విద్యార్ధిని ఆత్మహత్య.
(ఇచ్చోడ- విజయం న్యూస్) :

ఇచ్చోడ మండలం లోని తలమద్రి గ్రామంలో తిని తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి ఇచ్చోడ మండలం లో జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల పోలీసుల కథనం ప్రకారం వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ మండలం లోని తలమద్రి గ్రామానికి చెందిన గూలె శంకర్ కు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె గుండె పూజ ఇచ్చోడ లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది .

అయితే ఆ కళాశాలలో ఆ విద్యార్థికి చదవడం ఇష్టం లేదు . ప్రైవేటు కళాశాలలో చదువుతానని ఇక్కడ చదవండి తల్లిదండ్రులకు చెప్పింది. ఈ సంవత్సరం పూర్తి చేయు, వచ్చే సంవత్సరం చదివిస్తామని అని తల్లిదండ్రులు విద్యార్థినికి నచ్చచెప్పారు.రెండు నెలలు గడిస్తే నీ కోరిక మేరకు ప్రైవేట్ కళాశాలలో చేర్పిస్తామని మెప్పించారు .అయినప్పటికీ ఆమె నన్ను ప్రైవేటు కళాశాలలో చేర్పించ లేరని భయానికి తీవ్ర మనస్థాపం చెంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెల్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో బుధవారం సాయంత్రం ఇంట్లో తన చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది.

వ్యవసాయ పనులు ముగించుకుని తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఆ విద్యార్థిని వంట గదిలో పై కప్పు కు వేలాడడం తో కిందికి తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు .ఈ మేరకు గురువారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు .విద్యార్థిని ప్రైవేటు కళాశాలలో చేర్పిస్తారో లేదో అని తీవ్ర మనస్తాపం చెంది మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ విలేకరులకు తెలిపారు.

also read :- రాజీవ్ స్వగృహాలను మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలి.

 

please subscribe this chanel :- smiling chaithu