ఓం శివోహం..
★★ శివక్షేత్రాల్లో పోటేత్తిన భక్తజనం
★★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడిన ఆలయాలు
★★ జనసందోహమైన ‘తీర్ధాల’
★★ కూసుమంచిలో పోటేత్తిన జనం
★★ పలు దేవాలయాల్లో మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,నాయకులు పూజలు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
శివక్షేత్రాలన్ని భక్తజనంతో కిటకిటలాడాయి..శివాలయాలన్ని శివనామస్మరణతో మారుమోగాయి..వేలాధి మంది భక్తులు శివపార్వతులను దర్శించుకున్నారు.. వందలాధి మంది భక్తులు మొక్కులు తీర్చుకన్నారు.. తీర్థాల జాతర భక్తజనసందోహమైంది.. లక్షలాధి మంది భక్తులు తరలిరావడంతో కూడలి ప్రాంగణం ఇసుకవేస్తే రాలనంతజనసందడిగా మారింది..
ఇక కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయమైన కూసుమంచి గణపేశ్వరాలయం భక్తులతో పోటేత్తింది. వేలాధిమంది భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో పోటేత్తాయి.. భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు.. తీర్థాల జాతరలో భక్తులు మరణించిన కుటుంబ సభ్యులకు పిండప్రధానాలను చేసి అంటు తీయించుకున్నారు.
also read :-ప్రజల కోసమే ‘పాదయాత్ర’
ఈ సందర్భంగా ప్రత్యేకంగా వనబోజనాలు చేశారు. ఆ తరువాత మొక్కులు చెల్లించుకున్నారు. పలు దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో శివక్షేత్రాలకు తరలిరావడంతో అన్ని దేవాలయాలు కిటకిటలాడాయి.. భక్తుల శివనామస్మరణతో సందడిగా మారాయి.. భక్తులందరు ఓం నమ:శివాయ, ఓం శివోహం అంటూ నామస్మరణ చేశారు. దీంతో ఆలయాలు మారుమాగుపోయాయి..
★★ పలు దేవాలయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పూజలు
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ శివక్షేత్రాల్లలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవర్ ఆశ్రమంలో కొనసాగుతున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ వసంత లక్ష్మి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శివపార్వతులను దర్శించుకుని పూజలు చేశారు. కూసుమంచి, తీర్ధాల జాతరలో పాల్గొన్నారు. అలాగే కూసుమంచి, తీర్థాల జాతరలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, విజయమ్మ దంపతులు శివపార్వతులను దర్శించుకుని పూజలు చేశారు.
also read :-బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ : తమ్మినేని
అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండలం ముప్టిబండ గ్రామం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేశారు. అశ్వాపురం మండలం చితిర్యాల గ్రామం లో కాశీ విశ్వేశ్వర శ్రీ రామభక్త ఆంజనేయ ఆలయం – దక్షిణకాశి అష్ట భైరవ నవగ్రహ స్వయంభు చంద్రశిల శనీశ్వర దేవాలయం లో, మణుగూరు మండలం రామానుజవరం (కొండాయిగూడెం) గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ వైద్యనాథ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పూజలు చేశారు.
కల్లూరు పట్టణం,పుల్లయ్య బంజర రోడ్ లోని శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రం (కల్లూరు అప్పయ్య శివాలయం) నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య దంపతులు,టిఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొని దర్శనం చేసుకున్నారు. దమ్మపేట మండలం ముష్టిబండ, పెనుబల్లి నీలాద్రి, కల్లూరు పుల్లయ్యబంజర, తల్లాడ నూతనకల్, వైరా స్నానాల లక్ష్మీపురం, కొణిజర్ల పల్లిపాడు, ఖమ్మం అర్బన్ లోని ధంసలాపురం,ముదిగొండ వల్లాపురం, కూసుమంచి శివాలయం, ఖమ్మం రూరల్ తీర్థాల జాతరలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూజలు చేశారు.
సీఎల్పీ నేత మధిర శాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్క వారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క చిరుమర్రి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మృత్యుంజయ స్వామి లో మల్లు నందిని విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ తాతామధు కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలంలోని శివక్షేత్రాలను దర్శించుకున్నారు.
మాజీ ఎమ్మెల్సీ బాలసానిలక్ష్మినారాయణ, ఖమ్మం మేయర్ పూనకొల్లు నీరజ తదితరులు ఖమ్మం రూరల్ తీర్థాల సంగమేశ్వరస్వామి దేవాలయం పూజలు చేశారు. దేవాలయాలకు వచ్చిన ప్రముఖులకు ఆయల కమిటీ బాధ్యలు, దేవదాయశాఖాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణకుంబంతో స్వాగతం పలికారు. పూజ అనంతరం ప్రముఖులను ఘనంగా సన్మానించి జ్జాపికలను అందజేశారు.