Telugu News

పిట్రోల్ బంక్ పనులపై రెవెన్యూ & పారెస్ట్, అధికారుల దాడులు ఆపాలి,

ముప్పనపెల్లి, బోరుగూడెం, గ్రామస్థుల ధర్నా రాస్తారోకో,

0

పిట్రోల్ బంక్ పనులపై రెవెన్యూ & పారెస్ట్, అధికారుల దాడులు ఆపాలి,

– ముప్పనపెల్లి, బోరుగూడెం, గ్రామస్థుల ధర్నా రాస్తారోకో,

– పిట్రోల్ బంక్ నిర్మాణ పనులు చేస్తున్న, యాజమాన్యం పై రెవెన్యూ & పారెస్ట్, అధికారుల దాడులు సరికాదు,

– గ్రామస్థులు ఆగ్రహం

– రెవెన్యూ & పారెస్ట్, అధికారుల దాడులు ఆపకపోతే ధర్నా రాస్తారోకో లు ఉధృతం చేస్తాం, గ్రామస్థులు

(కన్నాయిగూడెం విజయం న్యూస్):-

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గల ముప్పనపెళ్ళి గ్రామ పంచాయతీ పరిధిలో బోరుగూడెం, లో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ (జిసిసి) సంస్థ వారి ఆధ్వర్యంలో పిట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు, కాగా ఈ నిర్మాణం దశలో ఉన్న పిట్రోల్ బంక్ పనులను రెవెన్యూ& పారెస్ట్, శాఖ ల అధికారులు ఈ భూమి మా పారెస్ట్ శాఖ ఆధీనంలో ఉంది అని ఆ పనులను గత మూడు వారాల నుండి అడ్డుకుని అవుతున్నారు, ఆ పనులను పునర్నిర్మాణం చేసి వేగవంతం చేయాలని ముప్పనపెళ్ళి, బోరుగూడెం, గ్రామస్థులు, ఆగ్రహం వ్యక్తంచేస్తూ రెవెన్యూ & పారెస్ట్ అధికారుల దాడులు అపాలంటూ ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ప్రధాన రహదారిపై పార్టీలకు అతీతంగా ధర్నా రాస్తారోకో నిర్వహించారు, కాగా రోడ్డు కు ఇరు వైపుల రోడ్డు పై వాహనాలు నిలిచిపోగా, ట్రాఫిక్ జామ్ అయ్యింది,

వాహనాదారుల సమాచారం మేరకు కన్నాయిగూడెం, ఎస్ఐ, చరణ్ కుమార్, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి చేరుకుని ముప్పనపెళ్ళి, బోరుగూడెం, గ్రామస్థులు తో ఈ సమస్యను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్లి మీ సమస్యను పరిష్కరించే విదంగా తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు, ఇంతటితో శాంతించక రెవెన్యూ & పారెస్ట్ అధికారుల దాడులు అపాలంటూ పిట్రోల్ బంక్ పనులు పునర్నిర్మాణం చేయాలంటూ లేని యెడల ధర్నా రాస్తారోకోలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ముప్పనపెళ్ళి, బోరుగూడెం, గ్రామాల ప్రజలు మహిళలు, యువకులు గ్రామ పెద్దలు వివిద పార్టీల నాయకులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు,

also read :-తామర పురుగుతో తంటాలు.