18న సీఎం చేతుల మీదుగా కంటి వెలుగు ప్రారంభం
== వీడియోకాన్ఫరెన్స్ లో వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్):
ఇది కూడా చదవండి: హీడ్మా చనిపోలేదు: మావోయిస్టు కార్యదర్శి అజాద్
కంటి వెలుగును సీఎం కేసీఆర్ ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం సాయంత్రానికి కంటి పరీక్ష పరికరాలు, కళ్లద్దాలు పీహెచ్‌సీలకు చేరాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని సూచించారు.స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.పరీక్ష బృందాలకు అవసరమైన సౌకర్యాలు స్థానికంగా కల్పించాలని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతికి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు, ప్రజలకు అర్థమయ్యేలా ఫ్లెక్సీలు, బోర్డులు ఎక్కడికక్కడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహణ ఉంటున్నందున సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు.
ఇది కూడ చదవండి: భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ : మంత్రి
== విడతల వారీగా 16,533 లొకేషన్స్ లో క్యాంపులువిడతల వారీగా 16,533 లొకేషన్స్ (రూరల్ -12,763, అర్బన్ -3,788)లో క్యాంపులు నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా 30లక్షల రీడింగ్ గ్లాస్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అధికారులు ప్రతిరోజూ క్యాంపులు సందర్శించాలన్నారు.