ఉరి వేసుకొని ఒకరి ఆత్మహత్య..
మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన బుఖ్య కౌసల్య (50) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జ్యోతి మణి తెలిపారు
ఉరి వేసుకొని ఒకరి ఆత్మహత్య..
(ఎర్రగుంట – విజయం న్యూస్):-
మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన బుఖ్య కౌసల్య (50) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జ్యోతి మణి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన బుఖ్య కౌసల్య తరచూ అనారోగ్యం బారిన పడటం, ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించినా అనారోగ్యంతో ఉండటం,
also read :- 108లో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం
కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అనారోగ్యం నుండి కోలుకోకపోవడం వలన మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలికి భర్త కుమారులు ఉన్నారని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
also read :- అభివృద్ధిలో టీకన్నపల్లి ఆదర్శం