ప్రతి నలుగురిలో ఒకరికీ జ్వరం
**జ్వర సర్వేలో వెల్లడి
** అందరికీ లక్షణాలే
(హైదరాబాద్ – విజయం న్యూస్)
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంది. ఒమిక్రాన్ బయటపడిన అనంతరం నెలరోజులుగా ప్రతి ఇంట్లో ఇవి సర్వసాధారణమయ్యాయి. రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్వర సర్వేలో వెలుగుచూస్తున్న వాస్తవాలివి. 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం తదితర లక్షణాలున్న వారు 1,28,079మంది. వీరిలో 1,27,372 మందికి కిట్లు ఇచ్చారు. చాలా మందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండా స్థానిక వైద్యుల సహకారంతో మందులు వాడుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లో కొవిడ్ లక్షణాల తీవ్రత తగ్గుతుండడంతో ప్రజలు తేలికగా తీసుకుంటున్నారు.
also read:-రోడ్డు ప్రమాదంలో పసికందు సహా ఐదుగురు దుర్మరణం
also read :-జోస్ మీదున్న పూజా హెగ్డే
లక్షణాలున్నా… లేవు లేవంటూ..
స్థానికంగా పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ బృందంగా ఏర్పడి రెండు రోజులుగా రోజుకి 100 గృహాలను జ్వర సర్వే చేస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే.. అక్కడే పరీక్షించి కిట్లు పంపిణీ చేస్తున్నారు. ‘‘కొందరు ఈ లక్షణాలున్నా భయంతో లేవని చెబుతున్నారు. తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఇంట్లో ఒకరికి ఏదో ఒక లక్షణం కనిపిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నాం’’ అని సర్వేలో భాగమైన పలువురు అధికారులు తెలిపారు. సగటున ప్రతి వంద మందిలో 25-30 మంది ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నట్లు వివరించారు. కొవిడ్ లక్షణాలు కనిపించినా కొన్ని చోట్ల నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. పాజిటివ్ వస్తుందేమోనని ముందుకు రావడం లేదు. ఇటీవల లోకల్ సర్కిల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పాజిటివ్ వ్యక్తితో తిరిగిన ప్రజల్లో దాదాపు 41 శాతం మంది పరీక్షలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడైంది.
also read :-జోస్ మీదున్న పూజా హెగ్డే