Telugu News

ప్రజా క్షేత్రంలో ప్రజలతో ఏకం కావాలి: నామా 

కార్యకర్తల సమావేశాల్లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

0

ప్రజా క్షేత్రంలో ప్రజలతో ఏకం కావాలి: నామా

👉 కార్యకర్తల సమావేశాల్లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

ఖమ్మం, ఏప్రిల్ 29(విజయం న్యూస్):

నాయకులు కార్యకర్తలు
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రతి గడపగడపకు వెళ్లి తలుపు తట్టి ప్రజలను కలిసి వారితో మమేకమై కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి తన విజయానికి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కార్యకర్తలను కోరారు.
ఆదివారం రాత్రి తల్లాడ ,కల్లూరు, చంద్రుగొండ మండలం తుంగారం లో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత
స్థాయి సమావేశాల్లో నామ పాల్గొని మాట్లాడారు.

ఇది కూడా చదవండి:- నేడు ఖమ్మం లో కేసీఆర్ బస్సుయాత్ర 
ప్రతి కార్యకర్త ఎక్కడివారక్కడ తమ గ్రామాల్లో పని చేయాలని అన్నారు. బూతు స్థాయిలో యూనిట్ గా చేసుకుని
తన విజయానికి కృషి చేయాలని చెప్పారు .
ఖమ్మం జిల్లా ప్రజలు రెండుసార్లు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపడంతో పెద్దఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పారు. మళ్లీ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. పార్లమెంటుకు ఎక్కువ రోజులు హాజరై అధిక ప్రశ్నలు అడిగి ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు సాధించి ఖమ్మం జిల్లా ప్రజల గౌరవాన్ని దేశస్థాయిలో ఇనుమడిoపజేశానని చెప్పారు. జిల్లాలో
జాతీయ రహదారులు వెనక తన కృషి చాలా ఉందన్నారు. కేంద్ర మంత్రులకు లేఖలు రాయడం ,మాట్లాడటం, పార్లమెంట్ సాక్షిగా కొట్లాడి జిల్లాకు జాతీయ రహదారులు తీసుకురావడం జరిగిందని చెప్పారు .

ఇది కూడా చదవండి:- కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయండి : నామా
ప్రతి కార్యకర్త ఒక నామ గా భావించి క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు,సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పార్టీ ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.