Telugu News

గడ్డ వాసనలో పెరిగిన వాడిని :నామా

కొత్తగూడెం అభివృద్ధి లో తన ముద్ర పుష్కలం

0

గడ్డ వాసనలో పెరిగిన వాడిని :నామా

❇️ ఇక్కడే చదువుకున్నా

❇️ ఈ ప్రాంత ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉంది

❇️ కొత్తగూడెం అభివృద్ధి లో తన ముద్ర పుష్కలం

❇️ భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం 120 లేఖలు రాశా — పార్లమెంట్ ను స్తంభింప జేశా

❇️ జిల్లా గొంతుకనై పార్లమెంట్ లో గళమెత్తా

❇️ మీ వాడిని ఆశీర్వదించండి

❇️ కార్మిక, శ్రామిక వర్గానికి నామ నాగేశ్వరరావు మేడే శుభాకాంక్షలు

👉 కొత్తగూడెం ప్రకాశం, ప్రగతి మైదానం , సెంట్రల్ పార్క్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్మాహించిన బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గారు

(కొత్తగూడెం -విజయం న్యూస్)

బిఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరావు బుధవారం ఉదయం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్, ప్రగతి మైదానం, సెంట్రల్ పార్క్ లో మేడే సందర్భంగా కార్మిక, శ్రామిక వర్గానికి మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఓట్లు అభ్యర్దించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ లో వాకింగ్ కోసం వచ్చిన
ప్రతి ఒక్కరిని వ్యక్తి గతంగా కలిసి తన కారు గుర్తు పై ఓటు వేసిఅత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తాను రాజకీయాల్లోకి రాకముందు పాల్వంచ కేటీపీఎస్ లో పనిచేసిన రోజులను, ఆనాడు కార్మికుల తో , తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి ఉన్న పరిస్థితులను
అవగతం చేసుకుని, గతస్మృతులను వారితో పంచుకున్నారు .ఖమ్మం జిల్లా ప్రజలు రెండుసార్లు తనను ఆశీర్వదించి మంచి మెజార్టీ తో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్ సాక్షిగా ఖమ్మం జిల్లా గొంతుకను వినిపించానని ,తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, జిల్లా జిల్లా సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించి సాధించానని చెప్పారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పెండింగ్ విభజన సమస్యలపై
గళమెత్తా నని చెప్పారు .
పార్లమెంటులో రాష్ట్రం నుంచి ఉన్న బిజెపి , కాంగ్రెస్ సభ్యులు ఏనాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదని చెప్పారు .కనీసం తాను సాగిస్తున్న పోరాటానికి కూడా సహకరించ లేదని తెలిపారు .ఎంపీలందరూ లో తాను అత్యధిక రోజులు పార్లమెంటు హాజరై అందరికంటే ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు అడిగి ఉత్తమ పార్లమెంటేరియన్ గా పుట్టిన జిల్లా ఖ్యాతిని దేశం నలుమూలల వ్యాపింప జేశానని తెలిపారు .
తాను పార్లమెంట్ లో ఉన్న ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజల గురించే ఆలోచిస్తానని చెప్పారు .ఈ జిల్లా
వాడినైన తనకు పాల్వంచ, కొత్తగూడెం తో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, ఈ ప్రాంతంలోనే తాను చదువుకున్నానని చెప్పారు. పాల్వంచలో టెన్త్ వరకు, కొత్తగూడెంలో ఇంటర్ చదివానని , ఇక్కడి ప్రజలతో తనకు అనుబంధం ఉందని చెప్పారు .తెలంగాణ ప్రయోజనాలు కాపాడగలిగే సత్తా ఒక్క బి ఆర్ ఎస్ ఎంపీలకు మాత్రమే ఉందని చెప్పారు .తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలి అన్న ఈ ప్రాంత సమస్యలు పరిష్కరిస్కారం కావాలన్నా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి కెసిఆర్ కు సంపూర్ణ మద్దతుగా నిలవాలని నామా నాగేశ్వరరావు కోరారు
భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం పార్లమెంట్ సాక్షిగా ఎంతో పోరాటం చేశానని ,
కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై 120 లేఖలు రాసి కేంద్ర మంత్రులను కలిశానని, ధర్నాలు చేసి పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీశానని గుర్తు చేశారు .అలాగే
ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తన ముద్ర ఉందని చెప్పారు .జాతీయ రహదారి నిర్మాణం లోనూ ,నూతన కలెక్టరేట్ నిర్మాణం లోనూ ,సింగరేణి సమస్యల పరిష్కారంలో పెద్ద ఎత్తున
పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయడం జరిగిందని చెప్పారు. సింగరేణి సంస్థను కేంద్ర కబంధహస్తాల నుంచి కాపాడటం కోసం పార్ల మెంటును స్తంభింపజేసి
పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా లు కూడా చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థ ను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయడం జరిగిందని తెలిపారు .
కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ
విషయంలోనూ తన ముద్ర ఉందని నామా గుర్తు చేశారు .కొత్త జిల్లా అయిన కొత్తగూడెంలో నవోదయ విద్యాలయం కోసం అలుపెరగని పోరాటం చేశానని నామ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహా లక్ష్మీ, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు మోరే భాస్కర్, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కొట్టు వెంకటేశ్వరరావు,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సంకు బాపన ప్రేమ్ దీప్, పాల్వంచ పట్టణ నాయకులు రమణమూర్తి నాయుడు, రేగడి మధు, జవహర్, సింధు తపస్వీ తదితరులు పాల్గొన్నారు.