Telugu News

రాష్ట్ర అర్థిక వ్యవస్థను నాశనం చేసింది కేసీఆర్: భట్టి

గాడిలో పెట్టి ప్రజలకు అర్థిక వెసులుబాటు కల్పించింది కాంగ్రెస్

0

రాష్ట్ర అర్థిక వ్యవస్థను నాశనం చేసింది కేసీఆర్: భట్టి

== గాడిలో పెట్టి ప్రజలకు అర్థిక వెసులుబాటు కల్పించింది కాంగ్రెస్

== మధిర నియోజకవర్గంలో రోడ్ షో లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

(మధిర-విజయం న్యూస్)

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్జీతో గెలిపించాలి.

మధిర కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ కు భారీగా తరలివచ్చిన ప్రజలు

మధిర శాసనసభ నియోజకవర్గం.. నాకు అత్యంత ప్రాణప్రదమైంది

మీరంతా ఓట్లేసి గెలిపిస్తే.. నేను ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి వద్దకు మాట్లాదుతున్న.

మీరు చూపించిన ప్రేమ, ఆశీస్సులే..మీ ద్వారా వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ద్వారా వచ్చిన హోదాని, ఈ బాధ్యతని ఈ ప్రాంత అభిప్రుద్ధి కోసం, రాష్ట్ర అభివ్రుద్ధి కోసం పనిచేస్తాను.

అనాదిగా వెనుకబడి ఉన్న ఈ మధిర పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అనేక రకాలైన ప్రణాళిలతో అభివ్రుద్ధి చేసుకుంటూ వస్తున్నాం.

ఇది కూడా చదవండి:- రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ మాత్రమే: రాహుల్ గాంధీ

ఇండోర్ స్టేడియం, డబుల్ రోడ్లు, డివైడర్లు, పాలిటెక్నిక్ కళాశాలకానీ ఇతర అభివ్రుద్ది కార్యక్రమాలన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో చేసే చూపించనవే.

ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మధిర పట్టణాన్ని మోడల్ టౌన్ గా మార్చాల్సి ఉంది.

మీరు నన్ను గెలిపించన క్షణం నుంచే అభివ్రద్ధికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేపసుకుని ముందుకు పోతున్నా.

అందులో భాగంగనే మధిర అవుటర్ రింగ్ రోడ్డును శాంక్షన్ చేయాలని ఆర్ అండ్ బీ మంత్రిని కోరడం, అనుమతులు రావడం జరిగింది.

మధిర నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఇక్కడు పెట్టి కోచింగ్ ఇప్పించే ప్రక్రియను ప్రారంభిస్తాం.

కాలేజీలో సైన్స్ సెక్షన్ ను మరింత అభివ్రుద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

మధిరను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు కావాల్సిన ప్రణాళికాబద్దంగా చేసుకుంటే వెళుతున్నాం.

ఇది కూడా చదవండి:- రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం మే: పొంగులేటి

మధిర మండలం, మధిర పట్టణంలో నివసిండం మా అద్రుష్టం అని ప్రజలు భావించేలా ఇక్కడ అభివ్రుద్ధిని చేసుకుందాం.

మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి.. తిరిగి ప్రజలకు పంచడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.

ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చి మేము ఇచ్చిన గ్యారంటీ హామీలను అమలు చేయలేదని చెప్పాడు.

నేను అడుగుతున్నా.. అయ్యా పెద్ద మనిషి నువ్వు చెప్పిన మూడెకరాలు ఇక్కడైనా ఇచ్చావా??

నువ్వె చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికైనా ఇచ్చావా??

రాష్ట్ర సంపదను పదేళ్లలో దోచేసి.. రాష్ట్రాన్ని అదోగతి పాల్చేశావు.

ఈ రాష్ట్ర ప్రజలపై రూ. 7 లక్షల కోట్ల అప్పును వేశావు.

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఆరోగ్యశ్రీ ని రూ. 10 లక్షలకు పెంచింది.

ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.