Telugu News

కాంగ్రెస్ కు ఓటేస్తేనే ప్రజాస్వామ్యానికి రక్ష: రఘురాంరెడ్డి 

ఖమ్మం లో ప్రసాద్ హైట్స్ అసోసియేషన్ సమ్మేళనంలో రఘురాం రెడ్డి

0

కాంగ్రెస్ కు ఓటేస్తేనే ప్రజాస్వామ్యానికి రక్ష: రఘురాంరెడ్డి 

– ఖమ్మం లో ప్రసాద్ హైట్స్ అసోసియేషన్ సమ్మేళనంలో రఘురాం రెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్):

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచున పడిందని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయగా కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. నగరంలోని ప్రసాద్ హైట్స్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. రాములోరు, అయోధ్య అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమన్నారు. కేంద్రం గ్యాస్, పెట్రోలు, డీజీల్ ఇతర నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెంచి సామాన్యులను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. డాక్టర్ కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, అసోసియేషన్ నుంచి కిలారు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.