Telugu News

ఒకే ఒక్క సూపరిపాలకుడు కేసీఆర్: నామా

విప్లవాత్మకమైన పథకాలతో అబ్బురపరిచే ప్రగతి

0

ఒకే ఒక్క సూపరిపాలకుడు కేసీఆర్: నామా

➡️ విప్లవాత్మకమైన పథకాలతో అబ్బురపరిచే ప్రగతి

➡️ అద్భుత పధకాలు – మిరాకిల్ పాలన

➡️ యావత్ దేశం చూపు తెలంగాణా వైపే

➡️ రానున్న ఎన్నికల్లో 10కి 10 సాధిస్తాం

➡️ కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయం

➡️ మరింత అభివృద్ధి కి కేసీఆర్ కు బాసటగా ఉందాం

👉 బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

 ఖమ్మం, జూన్ 09(విజయం న్యూస్):

 

సీఎం కేసీఆర్ సుపరిపాలనకు పదేండ్ల తెలంగాణా ప్రగతే తార్కాణమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం జరగనున్న సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఎంపీ నామ శుక్రవారం ఇక్కడ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల రూపకల్పన -, అమలులో తెలంగాణా రాష్ట్రం దేశానికే రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. కేంద్రం తెలంగాణా పధకాలను కాపీ కొట్టిందని అన్నారు. అభివృద్ధి లో దూసుకుపోతున్న తెలంగాణను చూసి పక్క రాష్ట్రాలు సైతం ఆశ్చర్యపోయి తెలంగాణా తరహా అభివృద్దిని కోరుకుంటూ కేసీఆర్ నాయకత్వం వైపే చూన్నాయని అన్నారు.

ఇది కూడా చదవండి:- వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

పరిపాలనలో విప్లవాత్మమైన సంస్కరణలతో రోజుకో కొత్త పధకంతో ప్రజల అభిమానాన్ని చూర గొంటున్నారని అన్నారు. సంక్షేమంలో కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ అభివృద్ధి ఫలాలు అందరికీ పంచుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పేదల సంక్షేమానికి రూ.2.29లక్షల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేయడం ఒక చరిత్ర అని అన్నారు.అన్న దాతల సంక్షేమానికి అగ్ర తాంబూలం ఇచ్చిన రైతుల పక్షపాతి కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ రైతు వేదికలు వంటి రైతు పధకాలు ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రైతు బంధు తో కేసీఆర్ చరిత్ర సృష్టించారని కొనియాడారు.

ఇది కూడా చదవండి:-  నేను రైతు పక్షమే..రైతుల కష్టాలు తెలుసు: నామా

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 65, 192 కోట్లను జమ చేయడం అద్బుతమని అన్నారు. ఇంతటి మిరాకిల్ ఎక్కడా లేదని ఎంపీ నామ స్పష్టం చేశారు. వృద్ధులు, అనాధాలు, మహిళలు, వికలాంగులు, చేతి కుల వృత్తి దారులు, బడుగు, బలహీన వర్గాలు, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, రైతు పధకాలు, గురుకుల విద్యాలయాలు, గొర్రెలు, బర్రెల పంపిణీ, దళిత బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తదితర విప్లవాత్మక పథకాలతో తెలంగాణా వెలుగొందు తున్నదని అన్నారు. తెలంగాణా ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తుందని అన్నారు. కెసిఆర్ దార్శనికత్వంలో తెలంగాణా అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుందని చెప్పారు. దేశానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని , రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడమూ తధ్యమని నామ నాగేశ్వరరావు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవశం చేసుకుని సత్తా చాటుతుందని అన్నారు. 9 ఏండ్లలో జరిగిన అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని అన్నారు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించి, ప్రజల్ని
కష్టాల పాలు చేసిన పార్టీలు ఎం చేశాయో ప్రజలకు తెలుసని అన్నారు.75 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 9 ఏండ్లలోనే చేసి, చూపించిన ఘనత ఒకే ఒక్కడు కేసీఆర్ కే దక్కుతుందని నామ అన్నారు.

ఇది కూడా చదవండి:-  పొంగులేటి సంచలన నిర్ణయం

యావత్ దేశం తెలంగాణా వైపే చూస్తోందని, పండుగ వాతావరణంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల నేపధ్యంలో కేసీఆర్ కు కొండంత అండగా..మద్దతుగా ఉండి, మళ్లీ గెలిపించుకొని, మరింత అభివృద్ధి కి చేయూతనిద్దామని నామ నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు.