Telugu News

కమలం నెక్స్ట్ టార్గెట్ ‘తెలంగాణ’

== తెలంగాణలో ఇప్పటికే బలంగా ముందుకు వెళ్తున్న బీజేపీ

0

కమలం నెక్స్ట్ టార్గెట్ ‘తెలంగాణ’
== ఏక పక్ష విజయంతో తెలుగు రాష్ట్రాలపై కన్నేసే అవకాశం
== తెలంగాణలో ఇప్పటికే బలంగా ముందుకు వెళ్తున్న బీజేపీ
== అతి త్వరలోనే ఆపరేషన్ కమలం షూరు
== అసమత్తులపై కన్నేసిన బీజేపీ
ఎవరూ ఊహించని విజయం.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్, గోవా, మణిపూర్ నాలుగు రాష్ట్రాలను ఏకపక్షంగా స్వంతం చేసుకున్న విజయం.. ప్రతిపక్షాలను బేజారు చేసి.. కాంగ్రెస్ కంచుకోటను కదిలించి ఖతం చేసిన కమలం పార్టీ, దేశంలో తిరుగులేని శక్తిగా మారింది..

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్న బీజేపీ, ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఏకపక్ష విజయంతో దేశంలోనే బలమైన శక్తిగా మారింది..తమకు తిరుగులేదు అంటూ దేశ ప్రజలకు, అసమ్మతి నేతలకు సూత్రప్రాయ హెచ్చరిక చేసింది.. బీజేపీ పనైందని అని చెప్పుకుంటున్న ప్రతి పక్ష పార్టీలకు చెంపచెల్లుమనే విధంగా సమాధానమిచ్చింది.. భారతదేశంలో ఇక మీ పని ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్ అన్నట్లు బీజేపీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. భారత దేశ సాధాహరణ ఎన్నికలకు సెమిఫైనల్ గా భావించిన ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ఫైనల్ కు చేరింది.. ఆ మ్యాచ్ లో కూడా ఏకపక్షం బీజేపీ కే స్వంతం అన్నట్లుగా తుది ప్రజాతీర్పు తెల్చిచెప్పినట్లైంది.. దీంతో మరింత ఉత్సహంగా ఉన్న బీజేపీ ఆగ్రనాయకత్వం దక్షణ తెలంగాణపై ద్రుష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

also read :-పంజాబ్‌లో ఓడిన సోనూసూద్‌ సోదరి

నాలుగు రాష్ట్రాల్లో దూకుడుగా వ్యవహరించిన బీజేపీ పార్టీ, అదే వేగంతో తెలుగు రాష్ట్రాలపైకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం తెలుగు రాష్ట్రాలపై కన్నేసేందుకు సిద్దంగా ఉన్నమంటూ బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. గురువారం వచ్చిన ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం కూడా కొంత మంది నాయకులు మాట్లాడుతూ ఇక మా టార్గెట్ తెలుగు నెలపైనే అంటూ ప్రకటనలు చేశారు. అదే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతుంది..
భారత దేశంలో 2014 ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో అద్భుతపాలనను అందించింది. అంతే వేగంగా 2019 ఎన్నికలకు వెళ్లిన బీజేపీ పార్టీ వరసగా రెండవ సారి ఘనవిజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించే విజయాన్ని స్వంతం చేసుకుంది.. నోట్ల రద్దు విషయంలో కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికి దేశప్రజలందరు బీజేపీ పార్టీకే పట్టం కట్టారు. అయితే 2014 ఎన్నికల అనంతరం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలను ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించినప్పటికి 2019 ఎన్నికల తరువాత రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నరేంద్రమోధీ, కేంద్రమంత్రి అమిత్ షా లు పరిపాలనలో లేని రాష్ట్రాలపై ద్రుష్టి సారించాయి..

also read;-నేటినుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర ఎన్నికలు మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. కర్నాటక రాష్ట్రంలో సీట్లు తక్కువ వచ్చినప్పటికి మోధీషా వ్యూహంతో ఆరాష్ట్రాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి మనమందరం చూశాం. ఆ తరువాత జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూనే ఉంది. ప్రస్తుతం రైతు ఆందోళన, నిత్యావసర ధరలు, రైతులపై ప్రమాదాలు, నేరఘటనలు ఇలాంటి పరిపాలన పరమైన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి, ప్రజా వ్యతిరేకత ఉందని భావించే సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, ప్రతిపక్ష పార్టీలకు ఆయా రాష్ట్రాల ప్రజలు సరైన సమాధానమిచ్చారు. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో ఏకపక్ష ఫలితాలను ప్రజలు అందించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికి, రైతులందరు వ్యతిరేకంగా ఉన్నప్పటికి, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, కాంట్రాక్ట్ వ్యవస్థపై కేంద్ర్రప్రభుత్వం ద్రుష్టిపెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత కనిపించింది.

also read;-ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్

ఈ సందర్భంలోనే కేంద్రప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడం గమనర్హం. అయితే ప్రజావ్యతిరేకతను అసరగా చేసుకుని ప్రభుత్వాన్ని దెబ్బతీయాల్సిన ప్రతిపక్షపార్టీలు పూర్తిగా వైఫల్యం చెందినట్లే కనిపిస్తోంది.. సరైన ప్రతిపక్షం లేకపోవడం, ప్రత్యామ్నయ పార్టీ, ప్రత్యామ్నయ నాయకుడు దేశస్థాయిలో ప్రజలకు కనిపించకపోవడం, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రజలకు నమ్మకం సన్నగిల్లడం, ఆ పార్టీలో కీలక నాయకుల్లో వర్గపోరు ఉండటం, తప్పుపై తప్పులు చేయడం పట్ల ప్రజలకు పార్టీపై విశ్వాసం పోయింది. పంజాబ్ లో రాష్ట్ర నాయకత్వం ఒకరిపై ఒకరు విమ్మర్శలు చేసుకోవడం, ముఖ్యమంత్రులను మార్చడం, తమ తప్పులను సరిదిద్దుకోకపోవడంతో పాటు కుల రాజకీయాలకు ప్రాథాన్య కల్పించడం ఫలితంగా కాంగ్రెస్ ఘోరంగా వైపల్యం చెందింది..

ఎక్కడ కనిపించని, ఎక్కడ వినిపించని, ఎక్కడ ప్రజల్లో ప్రచారం లేని ఆమ్ అద్మీ పార్టీ పంజాబ్ లో భారీ స్థాయిలో సీట్లు సాధించి ఘన విజయం సాధించడం అందుకు నిదర్శంగా చెప్పాలి.. అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేసినప్పటికి బీజేపీ రైతుల పట్ల, పంజాబ్ ప్రజల పట్ల చేసిన తప్పిదాల ఫలితంగా బీజేపీ బారీగా నష్టపోవాల్సి వచ్చింది. కానీ ఇతర నాలుగు రాష్ట్రాల్లో మాత్రం అద్భుత విజయం సాధించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఎక్కడ కనిపించలేదు. ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. దీంతో మూడవ సారి అధికారం వైపు బీజేపీ అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.. అయితే అందుకు గాను కొన్ని రాష్ట్రాలపై బీజేపీ కన్నేసే అవకాశం కనిపిస్తోంది.. దక్షణ భారతదేశంలో ఉన్న తెలంగాణ, ఆంద్రప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ర్టాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.. అందులో భాగంగానే గత రెండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ తెలుగు రాష్ట్రాలపై కన్నేసింది. గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వస్తోంది.. బలమైన శక్తిగా తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది..
== దక్షణభారతదేశంలో..?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ ముందుకు అడుగులేస్తున్న బీజేపీ పార్టీ దేశంలోనే బలమైన శక్తిగా అవతరిస్తోంది.. అందుకుగాను ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలను కైవసం చేసుకుంది. కాగా దక్షణ భారతదేశంలో ఉన్న ప్రధాన పెద్ద రాష్ట్రాలపై బీజేపీ కన్ను పడినట్లు కనిపిస్తోంది. భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్న బీజేపీ పార్టీ, దక్షణ భారతదేశంలోకి రాగానే చతికలబడుతోందనే చెప్పాలి. ఎన్నో సార్లు ఎన్నికలు నిర్వహించిన, ఎన్నో సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికి దక్షణభారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ గెలవలేకపోతుంది. కనీస స్థానాలను కూడా గెలవలేకపోతుంది..

ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు ఉన్నప్పటికి అక్కడ బీజేపీ వెనకబడిపోయిన పరిస్థితి మనందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ ఉత్తర భారతదేశంతో పాటు దక్షణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలను కైవసం చేసుకోవాలని ద్రుడ సంకల్పంతో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు గాను ముందు ఒక రాష్ట్రంలో పాగా వేసి, కొద్ది రోజుల్లోనే మిగిలిన రెండు రాష్ట్రాలపై కన్నేయాలని బీజేపీ జాతీయ అదిష్టానం భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ గా తెలుగు రాష్ట్రాలపై ద్రుష్టిపెట్టినట్లు కనిపిస్తోంది.
== నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే..?
బీజేపీ పార్టీకి ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వంపై విరుచకపడటం, దేశ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీని ఓడించాలనే ప్రయత్నం చేయడం పట్ల బీజేపీ చాలా గుర్రుగా ఉంది. అంతే కాకుండా భావించోచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో ఇప్పటికే పార్టీ బలంగా ఉంది. కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో పార్టీ బలంగా కనిపిస్తోంది. అక్కడ నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోగా, మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న చేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే.. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉండటం, ప్రత్యామ్నయ శక్తి, ప్రతిపక్ష పార్టీ లేకపోవడంతో, టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన కీలక నాయకులు అసమత్తిగా ఉండటం ద్వారా పార్టీని తొందరగా బలోపేతం చేయోచ్చని బీజేపీ అదిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలోనే సందులో సడేమియా అన్నట్లుగా తెలంగాణలోకి దూరడంతోనే తొందరగా అధికారాన్ని సాధించోచ్చనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ పార్టీ తెలంగాణ పై ద్రుష్టి పెడుతూ ‘నెక్ట్స్ టార్గెట్’ తెలంగాణే ను ఎంచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇప్పటికే ఆ విషయంపై తెలంగాణ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా గురువారం ఎన్నికల ఫలితాల తరువాత చూశాము. తెలంగాణ రాష్ట్రంను కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు బలంగా చెబుతున్నారు. అయితే అతి కొద్ది రోజుల్లోనే అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో మకాం వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు కూడా. మొదటిగా రాష్ట్ర స్థాయిలో నాయకులతో చర్చలు జరిపిన అనంతరం టీఆర్ఎస్, కాంగ్రెస్ లో అసమత్తితో ఉన్న బలమైన నాయకులకు గ్యాలం వేసే అవకాశం లేకపోలేదు.

అదే జరిగితే అసమత్తి నాయకులు బీజేపీ బాట పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి దేశంలోనే బలమైన పార్టీగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న బీజేపీ అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంపై చీమలదండు పడ్డటుగా జాతీయ నేతలందరు తెలంగాణ రాష్ర్టంలో పర్యటించే అవకాశం ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా ముందుకు సాగుతుంది.. టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ పార్టీలు ఏ విధంగా అడుగులేస్తాయో చూడాలి..