Telugu News

ప్రతిపక్షాలు ఆరోపణలకు అర్థం లేదు :రవిచంద్ర

ప్రతిపక్షాలపై మండిపడిన రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర

0

ప్రతిపక్షాలు ఆరోపణలకు అర్థం లేదు :రవిచంద్ర

== పిచ్చిపిచ్చి ప్రేలాపలను పలుకుతున్నారు

== మళ్లి బీఆర్ఎస్ దే విజయం

== ప్రతిపక్షాలపై మండిపడిన రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర

== బీఆర్ఎస్ ప్రతినిధుల సభకు హాజరైన ఎంపీ

(కూసుమంచి,ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు అర్థం లేదని, వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి ఆరోపణలకు అర్థం లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, ఒకప్పుడు మనం నీళ్లకు చాలా గోస పడ్డామని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి వల్ల ఇప్పుడా బాధ ఏ మాత్రం లేదన్నారు.కాళేశ్వరం,సమ్మక్క సారలమ్మ,మల్లన్న సాగర్,కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: అజాతశత్రువు రవిచంద్రుడు

అలాగే, సీతారామ ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని, దీంతో గోదావరి తో కృష్ణా అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు.ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుగా కనిపిస్తున్నాయని,కాలువలు పారుతున్నాయని,మండేఎండల్లో కూడా చెరువులు,కుంటలు అలుగులు పారుతున్నాయని వివరించారు.భూగర్భ జలమట్టాలు బాగా పెరిగిపోయినయ్,బావులు నిండుగా ఉన్నాయని,చేతులతో నీళ్లు అవలీలగా తోడుకుంటున్నామన్నారు.ఇక విద్యుత్,సాగునీరు,రైతుబంధు సాయం ఉచితంగా అందుతుండడంతో ఏటా మూడు పంటలు భేఫికరుగా పండించుకోవచ్చని పేర్కొన్నారు.ఈవిధంగా దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ అని నిరూపించి దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణను తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తున్నదని వివరించారు. 

 == పిచ్చి ప్రేలాపనలకు స్వస్తి పలకండి,పాలక పక్షంపై విమర్శలు తగవు: ప్రతిపక్షాలకు హితవు పలికిన ఎంపీ రవిచంద్ర

 జెడ్పీ ఛైర్మన్, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి లింగాల కమల్ రాజు నాయకత్వాన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మెర రాంమూర్తి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, ప్రతిపక్షాల నాయకులు పిచ్చిపిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని,పాలకులపై అనవసరమైన విమర్శలు తగవని,మానుకోవాలని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: కలిసి పనిచేద్దాం..మళ్ళీ గెలుద్దాం: మంత్రి పువ్వాడ

ప్రతిపక్ష నాయకులు నోటికి అదుపు లేకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని,వాళ్లేం చూస్తున్నారో, అసలేం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని వ్యాఖ్యానించారు.నిరుద్యోగ నిరసన ఏంది,అసలు ర్యాలీ చేయడమెందుకని నిలదీశారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐటీ,ఫార్మా రంగాలు ప్రగతిపథాన దూసుకుపోతున్నాయని, 9లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రభుత్వం 2లక్షల మందికి ఉద్యోగాలిచ్చిందని వివరించారు.ఇంకా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.అసలు కొందరు నాయకులు ఎక్కడ నుంచి వచ్చారో,ఏం మాట్లాడుతున్నరో చైతన్యవంతులైన ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసన్నారు.వాళ్ల ఆటలు ఇక్కడ సాగవని,మధిరతో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెల్చుకుంటుందని స్పష్టం చేశారు.