Telugu News

మాది రైతు ప్రభుత్వం

రైతులను ఇబ్బందులు పెట్టేద్దోనే యాసంగి పంట కొనుగోలు

0

మాది రైతు ప్రభుత్వం

== రైతులను ఇబ్బందులు పెట్టేద్దోనే యాసంగి పంట కొనుగోలు

== రైతులను మోసం చేసింది కేంద్రప్రభుత్వం

== ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రులు గంగుల, పువ్వాడ

== బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..

== వైరాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన.

== ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగంతో ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష.

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
మాది రైతు ప్రభుత్వమని, రైతులను రాజులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా పలు మండలాల్లో వారు పర్యటించారు. బీసీ స్టడీ సర్కిల్ భవనంను ప్రారంభించిన మంత్రులు, ఆ తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వైరాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశలించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

also read :-పట్టణ ప్రగతిపై మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ సమీక్ష

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రెండు జిల్లాల కలెక్టర్లు వి.పి గౌతమ్, దురిశెట్టి అనుదీప్, అదనపు కలెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వరరావు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ జిఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ పాయింట్స్:-

also read ;-నూతన వధు వరులకు శుభాకాంక్షలు

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పించండి.

పీపీసీల్లో మౌలిక వసతులు, సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయి.

సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో తెలంగాణలో దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.

కేంద్రం, ఎఫ్ సి ఐ మొదలైనప్పటి నుండి యాసంగిలో బాయిల్డ్, వానాకాలంలో రా-రైస్ మాత్రమే ఇస్తున్నాము.

తెలంగాణ రైతులపై కక్షతో కేంద్రం ఈసారి రా-రైస్ ఇవ్వమంటున్నారు.

యాసంగిలో పెరిగే broken పర్సంటేజీతో జరిగే నష్టాన్ని భరించి సీఎం కేసీఆర్  ధాన్యం సేకరిస్తున్నారు.

కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం.

అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో సేకరణలో నిమగ్నం అవ్వాలి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనుగోల్లు సజావుగా, అద్భుతంగా జరుగుతున్నాయని అర్థమవుతుంది.

ఖమ్మం జిల్లాలో 36,171 మెట్రిక్ టన్నులు సేకరణ, 21.20 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8043 మెట్రిక్ టన్నులు సేకరణ, 9 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే జిల్లాలో మొత్తం సేకరణకు సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయి.

మిల్లర్ల ఇబ్బందుల్ని సైతం ప్రభుత్వం పరిష్కరిస్తుంది.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాయింట్స్;..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ కృషితో కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి.

అక్కడక్కడ రైస్ మిల్లులు అన్లోడింగ్ చెయ్యట్లేదు అని ఫిర్యాదులు అందాయి వాటిని పరిష్కరించాం.

కేంద్రం తీరుతో రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సీఎం  ఆదుకున్నారు.

ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే తగు చర్యలు చేపట్టాం.

రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలి.