Telugu News

=అభివృద్ధిలో మేడిదపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది : ఎమ్మెల్యే కందాళ

తిరుమలాయపాలెం - విజయం న్యూస్

0

==అభివృద్ధిలో మేడిదపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది : ఎమ్మెల్యే కందాళ

== ఎన్నో సమస్యలను తీర్చాను పలు అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తాను.

== వాటర్ ప్లాంట్ ప్రారంభంచి ప్లాంట్ అభివృద్ధి పనుల

==ఖర్చులకు లక్ష రూపాయల హార్ధిక సాయం అందించిన ఎమ్మెల్యే కందాల.

==(తిరుమలాయపాలెం – విజయం న్యూస్):-
మండలపరిధిలోని మేడిదపల్లి గ్రామంలో బాల వికాస స్వచ్చంద సంస్థ వారి ఆర్ధిక సాయంతో పాటు గ్రామ పెద్దల సహాయ సహకరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన మినిరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డీ హాజరయ్యారు.శుక్రవారం స్థానిక సర్పంచ్ బండ్ల విజయ-సురేష్ లతో కలిసి నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.

also read ;-తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంమంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ మేడిదపల్లి గ్రామంలో ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. అంతరగత రహదారులతో పాటు పలు అభివృద్ధి పనులను త్వరలోనే అందిస్తానని వివరించారు. నియోజకవర్గంలో మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను అందిపుచ్చుకోని, సరైన పద్దతిలో ఉపయోగిస్తూ.. సర్పంచ్ విజయ-సురేష్ మేడిదపల్లి గ్రామాన్నీ అన్నివిధాల అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు.

also read ;-గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించాలి : మంత్రిపువ్వాడ
గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, సర్పంచ్ విజయ సురేష్ లు సమిష్టిగా కృషి చేస్తున్నారని కొనియాడారు. వాటర్ ప్లాంట్ నిర్మాణంకై ముందుకొచ్చిన బాల వికాస ఎండీ ప్రభాకర్ రెడ్డీని, గ్రామం నుంచి ముందుకొచ్చిన దాతలను ఈసందర్భంగా కందాల అభినందించారు. మండలంలో ఎక్కడైనా నూతన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే తనకు సమాచారం ఇవ్వాలని, అందుకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.

అనంతరం వాటర్ ప్లాంట్ అభివృద్ధి ఖర్చులకు గాను కందాల 1.లక్ష రూపాయలను సర్పంచ్ విజయ సురేష్ మరియు ఎంపిటిసి ఎర్ర పుష్పలత లకు అందించారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ జయరాం, ఎంపీవో రాజేశ్వరి, ఉపసర్పంచ్ ఉపేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు సురేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మహమూద్, వెంకటరెడ్డి,చంద్రరెడ్డి, విజయపాల్ రెడ్డి.తదితరులు పాల్గొన్నారు.