ఖమ్మం లో సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.
దశాబ్దాల కల నెరవేర్చిన అజయ్ కుమార్ కి రుణపడి ఉంటామన్న జర్నలిస్టులు.
ఖమ్మం లో సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
== మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , హరీష్ రావులకు టీజేఎఫ్ కృతజ్ఞతలు..*
== దశాబ్దాల కల నెరవేర్చిన అజయ్ కుమార్ కి రుణపడి ఉంటామన్న జర్నలిస్టులు..*
== ఖమ్మం జిల్లా టియుడబ్ల్యూజే జిల్లా మహాసభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం అందిస్తానని అల్లం నారాయణ నేతృత్వంలో ముందుకెళ్తామని నాడు చెప్పిన మాటను ఆచరణ సాధ్యం చేసి చూపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్)
20 ఏండ్ల జర్నలిస్టుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో సీఎం కేసీఆర్ ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తాననే మాటను నిలబెట్టుకున్నది. మాట ఇస్తే మనమతిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జర్నలిస్టుల పక్షాన నిలిచారు.
ఇది కూడా చదవండి:- జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు క్యాబినెట్ అమోదం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆరోగ్యశాఖ
మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణల కృషి మేరకు ఇండ్లస్థలాల ప్రక్రియ కు ప్రభుత్వ ఆమోదం లభించింది. హైదరాబాద్ లో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఆమోదించడం పట్ల ఖమ్మం జిల్లా టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా గురువారం సీఎం కేసీఆర్,మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్రు, తన్నీరు హరీష్ రావు ర్చి చిత్ర పటాలకు క్షీరభిషేకం నిర్వహించారు..
ఇది కూడా చదవండి:- జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్య ను పరిష్కరించండి:టీజేఎఫ్
ఇచ్చిన మాటకు కట్టుబడి, చెప్పిన విధంగా 23 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా
టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ,చిర్రా రవి
టీయూ డబ్ల్యూయుజె(ఐజేయు) జాతీయ కార్యవర్గ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు,జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి,బొల్లం శ్రీనివాసరావు, టెంజూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రామకృష్ణ,శెట్టి రజినీకాంత్ లు మాట్లాడుతూ
ఇది కూడా చదవండి:- రైతులు ఆదైర్యపడోద్దు..? ప్రతి గింజను కొంటాం: మంత్రి
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ ను మెప్పించి,క్యాబినెట్ ఆమోదం కు కృషిచేసి జిల్లాలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలం ఇప్పించేందుకు కృషి చేయడం పట్ల జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దుంపల భాస్కర్, సంతోష్, చక్రవర్తి, సహాయ కార్యదర్శి జానిపాషా, టివిజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, ఫయాజ్, మంద శరత్,
ఫొటోగ్రాఫర్ ల అధ్యక్షులు రాజు, రవి, నగర కమిటీ కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, టెంజూ అధ్యక్ష,కార్యదర్శులు యలమదల జగదీశ్,అశోక్,ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు,కొరకొప్పుల రాంబాబు..