Telugu News

పాలేరు నియోజకవర్గానికి శుభవార్త

నీరుద్యోగులకు మేలు

0

పాలేరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త

** యువతకు నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం

** మంజూరు చేసిన ప్రభుత్వం

** త్వరలో శంకుస్థాపన

(పెండ్ర అంజయ్య)

(కూసుమంచి -విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ  ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. మత్స్యకారులకు, నిరుద్యోగ యువతియువకులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నేరవేరే సమయం అసన్నమైంది.

Allso read:- త్వరలో స్టాఫ్ నర్సు ఏఎన్ఏం ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నూతనంగా పాలిటెక్నిక్  కళాశాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మత్య్స శాఖ ఆధ్వర్యంలో  కళాశాలను, పరిశోధన కేంద్రాన్ని, పాలిటెక్నిక్ కళాశాలపై దృష్టి సారించింది. పలు ప్రాంతాల్లో మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నాటి మంత్రులకు సీఎం కేసీఆర్ మంత్రులకు ఆదేశాలిచ్చారు.. అలాగే పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ విద్యాసాగర్ రెడ్డి నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి  వినతి చేశారు. పాలేరు జలాశయంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జలవనరులు ఉన్నాయని, మత్య్సకారులు కూడా చాలా మంది ఉన్నారని, అందుకే మంచి కళాశాల ను మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తిరిగి మరోసారి ఆ ఫైల్ ను కదిలించారు. వాటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మత్స్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  పాలిటెక్నిక్ మత్స్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు గాను ఖమ్మం జిల్లాను ఎంపిక చేసి, అందులో భాగంగానే పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పాలేరు నియోజకవర్గ జలాశయం సమీపంలో పాలిటెక్నిక్ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థల సేకరణ కోసం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారిచేయగా జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ఆధ్వర్యంలో కూసుమంచి మండలంలో స్థల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

allso read:-అసెంబ్లీలో కేంద్రంపై మండిపడిన మంత్రి పువ్వాడ

అయితే మండలంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట- మల్లాయగూడెం మార్గమధ్యలో ఖాళీగా ఉన్న సుమారు పదిహేకరాల ఎన్ ఎస్పీ ఖాళీ స్థలాన్ని పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించగా రాష్ట్ర మత్స్యశాఖ ఆ ఖాళీ స్థలాన్ని ఆమోదించింది. దీంతో కూసుమంచి మండల రెవెన్యూ అధికారులు ఎన్ఎస్పి అధికారులకు పది ఎకరాల స్థలాన్ని పాలిటెక్నిక్ కేటాయిస్తూ మత్స్య శాఖ అధికారులకు అందించడం జరిగింది. బుధవారం జుజ్జులరావుపేటలోని ఖాళీ స్థలాన్ని  ఎన్ఎస్పి డిఈ రమేష్ రెడ్డి, కూసుమంచి, తహసిల్దార్ మీర, సర్వేయర్ రవి, మత్స్య శాఖ ఏడి ఆంజనేయులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోనే మత్య్సశాఖ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం చేస్తే ఇదే మొదటిది కావడం గమనార్హం. అతి త్వరలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, మత్య్సపరిశోధన కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి, మత్య్సశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించనున్నారు.

ఇది కూడా చదవండి:-భద్రాచలం వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత