Telugu News

‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

దోస్తుల వనంలో గుచ్చుకుంటున్న ‘గులాబీ’ ముళ్లు

0

‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

== దోస్తుల వనంలో గుచ్చుకుంటున్న ‘గులాబీ’ ముళ్లు

== అక్కడ దోస్తి.. ఇక్కడ కుస్తి

== ‘బీఆర్ఎస్’లో టిక్కెట్ వార్

== కందాళలకు టిక్కెట్ ఖాయమంటు సంచలన వ్యాఖ్యలు చేసిన తాతామధు

== టిక్కెట్ రేసులో కందాళ, తుమ్మల, తమ్మినేని

== తాతామధు ప్రకటనతో అవాక్కైన తుమ్మల, తమ్మినేని అనుచరులు

ఇదికూడా చదవండి:- పొంగులేటి ఖబర్దార్!

స్వంత నిర్ణయమా..? పార్టీ అదేశమా..? మనుసులో మాట… అధినేత చూపించిన బాట..ఇందులో ఏది నిజమో తెలియదు కానీ.. ఎమ్మెల్సీ తాతామధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారిపోయాయి.. ఒక వైపు అధినేత కమ్యూనిస్టులతో దోస్తి కడుతుంటే.. మరో వైపు పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కుస్తిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. బహిరంగ వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఒకరినోకరు సహాయం చేసుకుంటున్నట్లుగా ప్రకటనలు చేస్తుండటంతో ప్రస్తుతం రాజకీయాల్లో పుల్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది.. ఇంతకి తాతామధు ఏమన్నడు.. తుమ్మల, తమ్మినేని వర్గీయులు ఎందుకు అంతర్మథనంలో పడిపోయారో..? తెలుసుకోవాలంటే ఈ కథనంను పూర్తిగా చదవండి:

(కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గంలో టిక్కెట్ వార్ కొనసాగుతోంది.. దోస్తుల మధ్య లొల్లి పీక్ దశకు చేరుకుంటోంది.. జతకట్టాల్సిన చేతులు.. వేలేత్తి చూపించుకునే దశకు చేరకుంటోంది.. ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది..

ఇది కూడా చదవండి:- ఖమ్మం రూరల్ లో భూ ‘గురి’విందలు….

అధినేత ఆదేశించించిన అంశాలను అమలు చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు తాతామధు చేసిన ప్రకటనతో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో లొల్లి మరింత జఠిలమైంది.. అంతా అయిపోయింది..కలిసి పనిచేసే సమయం వచ్చిందనుకుంటున్న తరుణంలో తాతామధు వ్యాఖ్యలతో దోస్తుల వనంలో గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నపరిస్థితి ఏర్పడింది. దీంతో ఎర్రదండులో కలవరం షూరు అయ్యింది.. గులాబీ వనంలో గందరగోళం ప్రారంభమైంది.. కార్యకర్తలు, పార్టీ నాయులు ఆయోమయంలో పడిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాఫిక్ గా మారిన నియోజకవర్గం ‘పాలేరు’ నియోజకవర్గం. జనరల్ స్థానమైన ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి ఆశావాహులు ఎక్కువైయ్యారు. అధికారపార్టీ నుంచి ప్రతిపక్ష, విపక్ష పార్టీలు సైతం పోటీ చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉండగా, అదే పార్టీ బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాలేరు నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నాయకుడు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:- జిల్లాలో ‘చడ్డీ గ్యాంగ్’  తిరుగుతోంది: తాతామధు

అందులో భాగంగానే ఆయన ఇటీవలే ఎక్కువగా గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలను, నాయకులను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నంచేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తుకు సై అన్న సీపీఎం పార్టీ నుంచి తమ్మినేని వీరభద్రం, పొతినని సుదర్శన్ రావుల్లో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది.. అందులో భాగంగానే సీపీఎం పార్టీ ఇప్పటి నుంచే కసర్తతు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, రామసహాయం మాదవిరెడ్డి, మద్దిశ్రీనివాస్ రెడ్డిలు ఆశావాహులు ఉండగా, జలగం వెంకట్రావ్, జలగం ప్రసాద్ రావు, రఘురాం రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు వైపు వచ్చే అవకాశం కనిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాన అభ్యర్థిగా వైఎస్ షర్మిళ పాలేరు నుంచే పోటీకి సై అంటున్నారు. బీజేపీ నుంచి ప్రస్తుతం కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీఎస్పీ నుంచి అల్లిక వెంకటేశ్వరారవు పోటీలో ఉండే అవకాశం ఉంది.

== బీఆర్ఎస్ లో టిక్కెట్ లోల్లి

పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ లొల్లి షూరు అయ్యింది.

ఇదికూడా చదవండి:- “గూడెం” పై కన్నేసిన ’కూనంనేని‘

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డి  రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్లగా ఆయన ఆ పార్టీ నుంచి టిక్కెట్ కావాలని పట్టుపడుతున్నారు. 2018 ఎన్నికలకంటే ముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుమరో సారి పోటీ చేయాలని ద్రుఢ సంకల్పంతో ఉన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నమో అక్కడే ఎతకాలి అన్నట్లుగా ఎక్కడైతే ఓటమి చెందదామో అక్కడ నుంచే పోటీ చేసి కందాళ ఉపేందర్ రెడ్డిని ఓడించాలని తుమ్మల నాగేశ్వరరావు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనేక సార్లు మీడియాలో స్పష్టంగా వివరించారు తుమ్మల నాగేశ్వరరావు. అలాగే సీఎం కేసీఆర్ నాకు మాటిచ్చారు. కచ్చితంగా టిక్కెట్ వస్తుందని తుమ్మల నాగేశ్వరావు బల్లా గుద్ది చెబుతున్నారు.   దీంతో కందాళ వర్సెస్ తుమ్మల గా నియోజకవర్గంలో మారిపోయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత ఆయోమయానికి గురవుతున్నారు.

== కందాళకే టిక్కెట్ అని అంటున్న మంత్రి, ఎమ్మెల్సీలు

పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ కచ్చితంగా కందాళకే వస్తుందని ఇటీవలే పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభావేదిక సాక్షిగా కందాళకే టిక్కెట్ వస్తుంది, మళ్లి గెలిచేది కందాళనే అందులో డౌటే లేదన్నారు.

ఇది కూడా చదవండి:- అధికారం ఎవడబ్బా సొత్తుకాదు: పొంగులేటి

దీంతో అప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తరువాత  ఇటీవలే సీపీఎం చేపట్టి చైతన్య యాత్రకు హాజరైన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి టిక్కెట్ నాకే వస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాటిచ్చిండని చెప్పడంతో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. అదే సమయంలో  మరో వైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వెంటవేసుకుని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. కచ్చితంగా నాకు సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉంది.. నాకే టిక్కెట్ వస్తుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నాడు. ఈ తరుణంలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు సంచలనమైయ్యాయి.  ప్రస్తుతం జీళ్లచెరువు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి అతిథులుగా హాజరైన తాతామధు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టికే పాలేరు ఎమ్మెల్యే టిక్కేట్ వస్తుందని, అందరు కలిసి సేవకుడ్ని గెలిపించాల్సిన బాధ్యత మీదేనని ప్రజలను కోరారు.  దీంతో ఒక్కసారిగా తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల్లో కలవరం మొదలైంది. అంతే కాకుండా సీపీఎం పార్టీ నేతల్లో కూడా భయాందోళన నెలకొంది. తాతామధు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాఫిక్  మారాయి. ఎక్కడ సోషల్ మీడియాలో చూసిన, ఏ టీవీ, ఏ పేపర్లో చూసిన ఎమ్మెల్సీ తాతామధు చేసిన వ్యాఖ్యలు పదేపదే రిపిట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. అయితే తాతామధుసూదన్ చేసిన వ్యాఖ్యలతో తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, సీపీఎం పార్టీ నాయకులు అవాక్కైనట్లు తెలుస్తోంది. తాతామధు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా..? లేదంటే పార్టీ అదిష్టానం వాళ్లకు ఏదైనా ఆదేశాలు ఇచ్చారా..? అనే విషయంపై తుమ్మల, తమ్మినేని అనుచరులు పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు.

== అక్కడ దోస్తి..ఇక్కడ కుస్తి

మునుగోడు ఎన్నికల పుణ్యామా అని కమ్యూనిస్టులతొ దోస్తి కట్టిన సీఎం కేసీఆర్ ఆతరువాత కూడా రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు పూర్తి స్థాయి అంగీకారం చేసుకున్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఎక్కడ చూసిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులతో కలిసి పర్యటన చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- పొంగులేటి వర్గంలో ‘పాలేరు’ అభ్యర్థి ఎవరు..?

సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో దోస్తిగా ఉంటున్నారు. అయితే అదే కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులతో కుస్తిపడుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లు రాలవని, వాళ్లకు ఓట్లేసేవారే లేరని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తే, సీపీఎం పార్టీతో పొత్తు ఉన్న పాలేరు టిక్కెట్ కందాళ ఉపేందర్ రెడ్డికేనంటూ ఎమ్మెల్సీ తాతామధుసూదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ అదినేత దోసికట్టి తిరుగుతుంటే, పాలేరు నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా పాలేరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్, సీపీఎం పార్టీల దోస్తుల్లో టిక్కెట్ వార్ మొదలైనట్లే కనిపిస్తోంది. మరీ ఈ రెండు పార్టీల టిక్కెట్ వార్ విషయంలో సీఎం కేసీఆర్ కల్పించుకుని చక్కబెడతారో..? లేదంటే  ఈ వార్ వీడిపోయే వరకు కొనసాగుతుందో చూడాల్సిందే..?

== కమ్యూనిస్టులకు నూకలు చెల్లాయి: కందాళ

పాలేరు టిక్కెట్ ను సీపీఎం పార్టీ ఆశీస్తుండగా ఆ టిక్కెట్ రేసులో ఉన్న కందాళ ఉపేందర్ రెడ్డి కమ్యూనిస్టులపై బహిరంగంగానే విమ్మర్శలు చేస్తున్నారు. కమ్యూనిస్టులకు నూకలు చెల్లాయని, ఆ పార్టీకి ఓట్లు రాలవు అంటూ విమ్మర్శలు చేశారు. అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసేది చేసేదే అంటూ ఖరాకండిగా చెప్పేశారు. నేను కచ్చితంగా పోటీ చేస్తున్నానని, ప్రజలందరు నన్ను ఆశీర్వదించాలని కందాళ ఉపేందర్ రెడ్డి ప్రజలను కోరారు.

== తాతామధు సంచలన వ్యాఖ్యలు

మరో వైపు తాతామధు సూదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీళ్ళచెరువులో జరిగిన ఎద్దుల పంద్యాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ తాతామధుసూదన్  కందాళ ఉపేందర్ రెడ్డికి టిక్కెట్ వస్తుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాటిచ్చారని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. కందాళ ఉపేందర్ రెడ్డి ప్రజా సేవకుడని, అలాంటి వారికి టిక్కెట్ ఇవ్వకుంటా ఉంటామా..? అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

== కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేస్తా : తమ్మినేని

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం  ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరు టిక్కెట్ లో సీపీఎం పార్టీ పోటీ చేయాలని భావిస్తుందన్నారు.  సీపీఎం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి టిక్కెట్ల లొల్లి రాదేమోనని, కచ్చితంగా మేము అడిగి సీట్లు ఇస్తారనే అనుకుంటున్నామని తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అడిగే సీట్లలో పాలేరు ప్రథమ ప్లేస్ లో ఉందని, పాలేరు ఇవ్వాలని గట్టిపైట్ చేయాల్సి వస్తుందన్నారు. పార్టీ అదేశిస్తే కచ్చితంగా పోటీ చేస్తానని తమ్మినేని వీరభద్రం మనసులో మాట మీడియాకు చెప్పేశారు.

== పాలేరులో మరోసారి గెలవడమే లక్ష్యం: తుమ్మల

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గం అభివద్ది విషయంలో అద్భుతంగా చేశానని అన్నారు. సీఎం కేసీఆర్ నాకు టిక్కెట్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నానని అన్నారు. కచ్చితంగా పోటీ చేస్తున్ననని తెల్చి చెప్పారు.