Telugu News

పాలేరు ఎమ్మెల్యే కందాళకు కరోనా పాజిటీవ్..?

సాధాహరణ వైద్య పరీక్షల్లో కరోనా పాజిటీవ్ గా నిర్థారణ..?

0

పాలేరు ఎమ్మెల్యే కందాళకు కరోనా పాజిటీవ్..?

== సాధాహరణ వైద్య పరీక్షల్లో కరోనా పాజిటీవ్ గా నిర్థారణ..?

(కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది.. గత కొద్ది రోజుల క్రితం ప్రజల్లో వివిధ కార్యక్రమాల నిమిత్తం  పాలేరు నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి డిసెంబర్ 31న హైదరాబాద్ కు వెళ్లారు. కాగా ఆయన గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.. ఆయనతో పాటు తిరిగిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ చెబుతున్నట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

== త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి కరోనా పాజిటీవ్ వచ్చిందని తెలుసుకుంటున్న అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుళ్లకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన అందరివాడు అంటూ ఆయన త్వరగా సాధాహరణ మనిషిగా ప్రజల్లోకి రావాలని అకాంక్షిస్తున్నారు.

ALLSO READ :- ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవపై ఎఫ్ఐఆర్