Telugu News

కృషి వలుడు ‘రాయల’

పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావుతో విజయం ప్రతినిధి ప్రత్యేక ఇంటర్యూ

0

కృషి వలుడు ‘రాయల’

== పాలేరు ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం

== సేవ చేయడమే కానీ..చెప్పుకోలేదు..పత్రికల్లో రాయించుకోలేదు

== ఎన్నో అటుపోట్లు ఎదుర్కున్న

== టిక్కెట్ వస్తుందనే నమ్మకం ఉంది

== టిక్కెట్ వచ్చిన రాకపోయిన పార్టీ వీడేది లేదు

== నాకు మిత్రులే కానీ..శత్రువులు లేరు

== అదే నాకు మేలు చేస్తోందన్న రాయల నాగేశ్వరరావు

== పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావుతో విజయం ప్రతినిధి ప్రత్యేక ఇంటర్యూ..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నేను పుట్టింది.. పెరిగింది.. చదవింది.. తిరిగింది.. ఉద్యోగం చేసింది.. వ్యాపారం చేసింది.. అన్ని పాలేరు నియోజకవర్గంలోనే.. నా సేవ పాలేరు నియోజకవర్గ ప్రజలకు అంకితం.. పాలేరు నియోజకవర్గ ప్రజలకే సేవ చేశాను.. చేస్తున్నాను.. చేస్తాను కూడా..  నేను కష్టాన్ని నమ్ముకున్నాను.. కృషితో..పట్టుదలతో ఏ పనినైనా సాధిస్తాను.. చిన్ననాటి నుంచే రాజకీయం అలవాటైంది.. రాజకీయం కోసం ఉద్యోగాలను వదిలేశాను..

Allso read:- అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కాంగ్రెస్

రాజకీయాల్లో అటుపోట్లు ఎన్నో ఎదుర్కున్నప్పటికి నిత్యం విద్యార్థినే. నేర్చుకుంటూనే ఉంటాను.. మరి ముఖ్యంగా నాకు శత్రువులు లేరు.. అందరు మిత్రులే.. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను.. అందుకే నాపై నాకు నమ్మకం ఉంది.. కచ్చితంగా కాంగ్రెస్ నన్ను గుర్తించి టిక్కెట్ ఇస్తుందనే నమ్మకం ఉంది.. నా పాలేరు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కాంగ్రెస్ అందిస్తుందేమోనన్న ధృడసంకల్పం ఉంది.. అందుకే నేను ఎప్పుడు కృషి వలుడ్నే అంటూ పీసీసీ మెంబర్ రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా పీసీసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావుతో ‘విజయం’ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్యూ.

ప్రశ్న: రాయల నాగేశ్వరరావు స్వగ్రామం ఎక్కడ..?

రాయల: ముదిగొండ మండలం, వెంకటాపురం గ్రామం..

ప్ర: తల్లిదండ్రులు, భార్య పిల్లలు వివరాలు..?

రా: రాయల కమలమ్మ,వెంకటేశ్వర్లు దంపతులకు ముగ్గురు సంతానం ఉంది. అక్క సీతమ్మ, నేను, తమ్ముడు శ్రీనివాస్. ఇక నా భార్య పద్మ,పిల్లలు శ్రీలీల, శ్రీలేఖ ఇద్దరు కూడాసాప్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు.

ప్ర: విద్యాభ్యాసం సంగతేంటి..?

రా: నేను బీఈ(బ్యాచలర్ ఆఫ్ ఇంజనీర్) చదువుకున్నాను.

ప్ర: రైతుకుటుంబం నుంచి వచ్చిన రాయల రాజకీయం వైపు ఎందుకు వెళ్లారు

రా: మాది రైతు కుటుంబం.. నేను, తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసుకున్నాము.. ఇప్పటికి వ్యవసాయం చేస్తున్నాము. మా నాన్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా పనిచేసేవారు..నేను మొదటి నుంచి కూడా చదువు, ఉద్యోగం వైపు అడుగు పడింది.

Allso read:-హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రకు రాండీ:భట్టి

కానీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఉద్యోగం చేయలేకపోయాను. రాజకీయం వైపు అడుగులు వేయాల్సి వచ్చింది.

ప్ర: రాజకీయాలు వద్దు.. బీఈ చదివి ఉద్యోగం చేసుకోవాలని ఎవరైనా చెప్పారా..?

రా: నేను ఇంజనీరింగ్ చేసిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. అప్పుడు పాలేరు షుగర్ ప్యాక్టరీలో ఇంజనీరింగ్ ఉద్యోగం అవకాశం వచ్చింది. చాలా తక్కువ జీతంతో అక్కడ పనిచేశాను. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ డబ్బులు సరిపోయేవి కాదు.. చాలా ఇబ్బందులు పడ్డాను.  ఆ తరువాత మధుకాన్ గ్రానైట్ ప్యాక్టరీలో మరో మూడు వందలు ఎగ్రస్ట్రా ఇస్తానంటే అందులో చేరాను. అక్కడ చాలా ఏళ్లు పనిచేశాను.

ప్ర: గ్రానైట్ పరిశ్రమకు ఎప్పుడు వచ్చారు..?

రా: నేను మధుకాన్ లో పనిచేస్తున్న సమయంలో ఓ మిత్రుడు ప్యాక్టరీ ఏర్పాటు చేద్దామని వచ్చారు. మొదటిగా అంగీకరించలేదు. రెండేళ్ల తరువాత 2000 సంవత్సరంలో చిన్నతరహా పరిశ్రమను స్థాపించాం. అది కూడా పాలేరు నియోజకవర్గంలోనే. మధుకాన్ ప్యాక్టరీలు తరువాత మేమే స్థాపించడం జరిగింది.

ప్ర: గ్రానైట్ పరిశ్రమ మేలు చేసిందా..?

రా: ఉద్యోగం చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డాను. వచ్చిన జీతంలో 500 మిగులుస్తూ కుటుంబాన్ని సాకుతూ వచ్చాను. నేను మా తల్లిదండ్రులపై ఆధారపడలేదు.

Allso raed:- అధికార అహంకారంతో ఊగిపోతున్న బిజెపి:రాయల

నా కష్టంతో ఎదగాలనేదే నా లక్ష్యం. అందుకే చాలా కష్టపడి పని చేస్తున్న సమయంలో గ్రానైట్ పరిశ్రమను ఏర్పాటు చేయడం, ఒక క్వారీ తీసుకోవడం. ఆ క్వారీ కోసం నానా తంటాలు పడటం. చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం. ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కరుణించి మంచి క్వారీ రావడం, అందులో మంచి రాయి పడటం నాకు కలిసివచ్చింది. ఆ తరువాత తిరిగి చూడలేదు.

ప్ర: గ్రానైట్ పరిశ్రమ కోసం చాలా కష్టపడ్డారంటగా..?

రా: గ్రానైట్ పరిశ్రమ స్థాపించిన తరువాత నేను చాలా కష్టపడ్డాను. ఆ తరువాత యూనియన్ బాధ్యతలు నాకు అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రం చిన్నపరిశ్రమల యూనియన్ కు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రానికి చిన్నతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడిగా 18ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. నేను వద్దు అంటున్నప్పటికి నాపై నమ్మకంతో ఆ బాధ్యతను కొనసాగిస్తున్నారు.

ప్ర: గల్లి నుంచి ఢిల్లీ వరకు గ్రానైట్ కోసం పోరాటం చేశారంటగా..?

రా: గ్రానైట్ పరిశ్రమను రక్షించుకోవడం కోసం నా ఆధ్వర్యంలో గల్లి నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశాము. జంతర్ మంతర్ వద్ద పోరాటం చేశాం. అనేక సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్దం చేశాం. సక్సెస్ అయ్యాం. ఇప్పుడు గ్రానైట్ పరిశ్రమ కష్టాల్లో ఉంది.. అదుకునే విషయంలో తెలంగాణ ప్ఱభుత్వం విఫలమైంది.. మాటిస్తున్నారే తప్ప అచరణలో సాధ్యం కావడం లేదు.

ప్ర: రాజకీయ ప్రవేశం ఎప్పుడు..?

రా: చిన్ననాటి నుంచి రాజకీయ కుటుంబమే కానీ.. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. మా నాన్న సీపీఎం పార్టీ అయినప్పటికి నేను సీపీఎం సభ్యత్వం కూడా తీసుకోలేదు. సానుభూతిపరుడిగా ఉండేవాడ్ని. మొదటి సారిగా మెగస్టార్ చిరంజీవి అభిమానంతో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరడం జరిగింది.

ప్ర: పాలేరులో పోటీ చేశారు కదా..? ఎలా అనిపించింది..?

రా: రాజకీయ ఓనమాలు కూడా మాకు తెలియదు. కొత్తపార్టీ. అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. డబ్బులు అంతగా లేవు. గెలుస్తామనేదానికంటే అనుభవమైన వస్తుందనే ఆలోచన ఉండేది.. గెలవడం కోసం చాలా కష్టపడ్డాము. అయినప్పటికి సీపీఎం, కాంగ్రెస్ మధ్యలో నాకు సుమారు 20వేల ఓట్లు వచ్చాయి. అయితే ఆ ఎన్నికలు మాత్ర చాలా అనుభవాన్ని నేర్పించాయి.

ప్ర: కాంగ్రెస్ లో ఎప్పుడు చేరారు..?

రా: 2010 సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో వీలనం చేశారు. అదే రోజు మేమంతా కాంగ్రెస్ పార్టీలో వీలినం అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నాం.

ప్ర:  పాలేరులో పోటీ చేసిన తరువాత మళ్లి తిరిగి ఎందుకు పోటీ చేయలేదు..?

రా: కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత 2014, 2018 ఎన్నికల్లో టిక్కెట్ కోసం చాలా ప్రయత్నం చేశాం. ఒకనాకో దశలో 2016 ఉప ఎన్నికల్లో, 2018లో టిక్కెట్ వస్తుందని ఆశించాము. కానీ 2016లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతిమణికి, 2018లో కందాళ ఉపేందర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. అయినప్పటికి నేను పార్టీ మారకుండా, పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఇప్పటి వరకు పనిచేస్తున్నాను.

ప్ర: ప్రస్తుతం టిక్కెట్ రేసులో మొదటి స్థానంలో ఉన్నారు.. టిక్కెట్ వస్తునుకుంటున్నారా..?

రా: 2010 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఆ నాటి నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం నేను ఆగాల్సి వచ్చింది.. ఇప్పుడు కూడా టిక్కెట్ ఆశీస్తున్నాను. టిక్కెట్ ఇస్తారనే ప్రగాడ నమ్మకం నాకు ఉంది.

ప్ర: పార్టీలో పోటీ తత్వం ఎక్కువ ఉంది.. కొత్తవారికి అవకాశం రావోచ్చేమో..? అప్పుడు..?

రా: నాకు టిక్కెట్ ఇవ్వమని అడుగుతున్నాను. టిక్కెట్ కోసం కాకుండా పార్టీ బలోపేతం కోసం పాలేరు నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. చాలా ఖర్చు చేస్తున్నాం కూడా. ఒక వేళ టిక్కెట్ రాకపోయిన. కొత్తగా ఎవరైనా వేరే పార్టీ నుంచి ప్రధాన నేతలు వచ్చి టిక్కెట్ అడిగిన, వారికి ఇచ్చిన నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా..? నాకు టిక్కెట్ వచ్చిన రాకపోయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం కష్టపడి పోరాటం చేసి గెలిపిస్తాం.

ప్ర: పార్టీ మారాలని చాలా ఒత్తిడి తీసుకొచ్చారని తెలిసింది..?

రా: అవును. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని కేటీఆర్ నుంచి ఆహ్వానం అందింది. పార్టీ మారలేదు. 2016లో ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఆహ్వానం అందింది. వెళ్లలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుతం ఉన్నవారు కూడా పార్టీ మారమని చాలా ఒత్తిడిచేశారు. కానీ చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.

ప్ర: మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసి అధికార టీఆర్ఎస్ ను భయపెట్టారు..? ఏంటీ..మీదైర్యం.

రా : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటింగ్ చాలా తక్కువ ఉంది. కేవలం 67 ఓట్లు మాత్రమే మాకు ఉన్నాయి. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు బీఫామ్ ఇచ్చింది. ఓడిపోతామని తెలిసినప్పటికి కూడా ఫైట్ చేయాల్సిందేనని నిర్ణయించుకున్నాను. అందుకే అధికార పార్టీపై పోటీ చేశాను. 67 ఓట్లు మాకు ఉంటే 242 ఓట్లు నాకు వచ్చాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి ఓట్లేసిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపాను.

ప్ర: ఎమ్మెల్సీగాపోటీ చేసిన సమయంలో బెదిరింపులు రాలేదా..?

రా: చాలా బెదిరింపులు వచ్చాయి.. చాలా మంది మిత్రులు అధికారపార్టీతో, సీఎం కేసీఆర్ తో ఎందుకు అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. అయినప్పటికి నేను బెదరలేదు. నీ సంగతి చూస్తామని కూడా హెచ్చరించారు. ఆయన నేను

భయపడలేదు.. భవిష్యత్ లో కూడా భయపడను. ఒకానోక దశలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధిలు భయపడిపోయారు.. ఎక్కడ ఓడిపోతామోననే భయంతో ఓటర్లను ఇతర ప్రాంతాలకు గోవాలాంటి ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్ర : పాలేరు కాంగ్రెస్ కు కంచుకోట.. మరోసారి ఆ కోట నిలుస్తుందా..?

రా: పాలేరు నియోజకవర్గం ఎప్పటికి కాంగ్రెస్ కు కంచుకోటనే. దళిత,గిరిజన, బహుజన, అన్ని వర్గాల ప్రజలు జీవించే చైతన్యవంతమైన నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ అనేక సార్లు గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది.

ప్ర: రాయల నాగేశ్వరరావు సేవామంతుడు అనే పేరుంది…?

రా: నేను రాజకీయాల కోసం సేవ చేయలేదు. నేను ప్యాక్టరీ ప్రారంభించిన నాటి నుండే నా పాలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేశాను. గుడ్లు, బడులు, పేదలకు, పిల్లల చదువులకు, పేద మహిళల పెండ్లీలకు సేవ చేశాను. వందలాధి దేవాలయాలకు గ్రానైట్ ఇచ్చాము. నిరుపేదల ఇండ్లకు గ్రానైట్ ఉచితంగా ఇచ్చాము.

ప్ర: సేవ చేస్తారు.. కానీ ప్రచారం చేసుకోరు అనే మాట వాస్తవమేనా..?

రా: ఎస్. నాకు సేవ చేయాలనే ఆలోచనే ఉంది తప్ప. దానిని రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచన లేదు. ఇప్పటికి పాలేరు నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. ఏనాడు పేపర్లో వేయించుకోవడం కానీ, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టడం కానీ చేయలేదు. కోట్లాధి రూపాయల వరకు సేవ చేసి ఉంటాను. కానీ నేటికి ఒక్క పేపర్ కటింగ్ లేదు.

ప్ర: ఒక వైపు ఎమ్మెల్యే అర్థిక చేయూతనందిస్తున్నారు..మీ వైపు నుంచి..?

రా: నేను కూడా సేవకార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. కానీ అంత పెద్ద మొత్తంలో కాకుండా నాస్థాయికి తగ్గట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాను. సేవా కార్యక్రమాలు రాజకీయం కోసమే..ఓట్ల కోసమో..కాదు. నా వంతు సహాయం అంతే. దానిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు.

ప్ర: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది..?

రా: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించింది.. ప్రస్తుతం మనం భూమి మీద బతుకుతున్నామంటే అందులో కావాల్సిన అన్ని సౌకర్యాలను కాంగ్రెస్ ఇచ్చింది. రవాణా, రోడ్లు, నీళ్లు, నిధులు, నియామకాలు, శాశ్వత ప్రాజెక్టులు, సింగరేణి, స్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేయలేనదంటూ ఏమి లేదు. వ్యవసాయానికి కరెంట్ సౌకర్యం, యాంత్రలక్ష్మిపథకం, రుణమాఫీ, ఎత్తిపోతల పథకాలు, కొత్తకొత్త పంటలను పరిచయం చేయడం. స్కూళ్లు, దేవాలయాలు, పర్యాటకం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి.

ప్ర: కాంగ్రెస్ పై మీకు నమ్మకం ఏంటీ..?

రా: కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ.. పేదలకు ఆభయాన్నిచ్చే పార్టీ.. పేదలు నమ్మిన పార్టీ..పేద ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీ.. పేదల కోసం పనిచేసే వారికి గుర్తింపునిచ్చే పార్టీ.. అందుకే ఆ పార్టీపై నాకు నమ్మకం ఉంది.. రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇస్తారనే నమ్మకం నాకు ఉంది.. ఆ నమ్మకమే నన్ను ముందుకు తీసుకెళ్ల్తుంది.

ప్ర: మీ లక్ష్యం

రా: పాలేరు ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అయిన కాకపోయిన సేవ చేస్తూనే ఉంటా.. శాసన సభ్యుడిగా అవకాశం రావాలని కోరిక ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆవకాశం ఇస్తే.. ప్రజలు ఆశీర్వదిస్తే నా కోరిక నేరవేరే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మరింత సేవ చేసుకునే భాగ్యం నాకు వస్తుందనే నమ్మకం ఉంది.

ప్ర: థ్యాంక్యూ రాయల నాగేశ్వరరావు, ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్

రా: థ్యాంక్యూ..