Telugu News

పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాళ పర్యటన

= సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ

0

పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాళ పర్యటన
== సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ
(కూసుమంచి-విజయంన్యూస్)
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. కూసుమంచి మండలం పోచారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇందూర్తి రాంరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.అలాగే తిరుమలాయపాలెం మండలం జింకలగూడెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించిన సయ్యద్ చిన్న మదార్ కుటుంబాన్ని పరామర్శించారు. పిండ్రిప్రోలు గ్రామంలోని తాతా బిక్ష్మయ్య సతీమణి ఉదయమ్మ ఇటీవలే మరణించగా, వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంరతం జీళ్ళచెరువు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న సీసీ రోడ్డు పనులను కందాళ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. అక్కడ నుంచి క్యాంప్ కార్యాలయంకు చేరుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కందాళ అబిమానులు ముద్రించినటువంటి నూతన సంవత్సరం 2022 క్యాలెండర్ ఆవిష్కరిస్తారు.
== సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే
కూసుమంచి ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయంలో కూసుమంచి,నేలకొండపల్లి,తిరుమలాయపాలెం మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పంపిణీ చేశారు. కూసుమంచి మండలం-55 చెక్కులకు గానురూ. 25,48,500లను, నేలకొండపల్లి మండలం-30 చెక్కులకు గాను రూ.11,19,000లను, తిరుమలాయపాలెం మండలం 7 చెక్కులకు గాను 2,65,500లను లబ్దిదారులకు పంపిణి చేశారు. అలాగే ఖమ్మం రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రూరల్ మండలంకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు. 59వ డివిజన్ దానవాయిగూడెం నందు టీఆర్ఎస్ నాయకులు దామళ్ళ రవి కుటుంబాన్ని పరామర్శించారు. 60వ డివిజన్ రామన్నపేట నందు తుళ్లూరి శ్రీను కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేలను అర్థిక సహాయం అందజేశారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంకు హాజరైయ్యారు. అక్కడ నుంచి తిరిగి ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం పరిధిలోని టీసీవీ రెడ్డి కళ్యాణ మండపం నందు వివాహ వేడుకకు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బానోతు శ్రీనివాస్, బోడా మంగిలాల్, బెల్లం ఉమా, జడ్పీటీసీ వరప్రసాద్, మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

also read :-బెల్లంపల్లికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతి …