Telugu News

పాలేరు లో పోటీ చేయడం ఖాయం : తుమ్మల 

నేలకొండపల్లి మండలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

0
పాలేరు లో పోటీ చేయడం ఖాయం : తుమ్మల 
== ఎన్టీఆర్ వల్లే ప్రజలకు సేవ చేసే భాగ్యం
== నాకు  చిన్న వయసులోనే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు
== మంత్రి గా ఉండి అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశా
== మంత్రి గా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి కోసం రూ.45 వేల కోట్లు తీసుకొచ్చా 
== నేలకొండపల్లి మండలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
(నేలకొండపల్లి-విజయం న్యూస్)
మీ అందరి ఆలోచనతోనే నేను రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండలంలో సోమవారం పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తూరులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Allso read- షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఎన్టీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేశారని, అందులో నేను భాగస్వామిగా ఉండటం సంతోషకరమన్నారు.
కేసీఆర్ నాయకత్వం లో ఆగిపోయిన దుమ్ముగూడెం ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా రూపకల్పన చేసింది గోదావరి జలాలతో రైతులు భూముల్లో పసిడి పంటలు పండించాలని కోరారు.మంత్రి గా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధి కోసం రూ.45 వేల కోట్ల తీసుకొచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. కూసుమంచి, తిరుమలాయపాలెం, రూరల్ లో సాగునీటి సమస్య లేకుండా చేశానని, వెనుకబడి ఉన్న పాలేరు నియోజకవర్గంను భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం చేసి సస్యశ్యామలం చేశానని అన్నారు. గతంలో నీళ్ళు లేక బీటలు వారిన వరి పోలాలు పంటలతో కలకళలాడుతున్నాయని అన్నారు. ఎండిపోయిన చెరువుల్లో మత్తడి దుంకుతున్నాయని అన్నారు.   ఇప్పుడు  చెక్ డ్యామ్ ల ద్వారా కూడా రైతులకు సరిపడా  సాగునీటిని అందించామని అన్నారు.
అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ సాగు అవుతున్న భూములు పాలేరు లోనే ఉన్నాయని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే పాలేరు లో రెండున్నర లక్షలు సాగు అవుతుందన్నారు. తాగడానికి నీరు లేని ప్రాంతంలో నీటి సమస్య తేర్చానన్నారు.40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అందరి సంతోషం కోసమే పనిచేశానని అన్నారు. ఎన్టీఆర్  సాక్షిగా నన్ను గెలిపిస్తామన్నందుకు అందరికి న్యాయం చేస్తానని, మోసం చేసే గుణం నా వద్ద లేదన్నారు. ప్రజలకు పని చేయడమే నా లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా కోఆర్డినేటర్ నలమల వెంకటేశ్వర్లు, నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి,  సాదు రమేష్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, వెన్నుపూసల వెన్నుపూసల సీతారాములు, రమేష్, సుధాకర్ రెడ్డి,  భారీ వీరభద్రం మాదాసు ఉపేందర్, అరవపల్లి జనార్ధన్, కొండా మైపాల్, అశోక్