Telugu News

జాలరి వలలో చిక్కిన కొండ సిలువ

భయాందోళన చెందుతున్న మత్స్యకారులు

0

*జాలరి వలలో చిక్కిన కొండ సిలువ*

*భయాందోళన చెందుతున్న మత్స్యకారులు..*

(కూసుమంచి-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా, పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. గత కొద్ది నెలల క్రితం మొసళ్ళు జాలరుల వలలకు చిక్కుతుండగా, తాజాగా మరో సంఘటన జరిగింది.
పాలేరు జలాశయం లో శుక్రవారం చౌటపల్లి గ్రామానికి చెందిన గుర్రాల మల్సూర్ అనే జాలరి నర్సింహులగూడెం వద్ద గల పాలేరు జలాశయంలో చేపల వేటకు తెల్లవారు జామున వెళ్లగా ఆ జాలరి వలలో సుమారు 6 అడుగుల కొండ సిలువ చిక్కింది. దీంతో జాలరి భయభ్రాంతులకు గురై ఇతర జాలర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో అందరు కలిసి హతం చేసిన సంఘటన చోటు చేసుకుంది.

Also read :- పవన్ కళ్యాణ్ కోసం పాదయాత్ర…ఓ యువకుడి సాహాసం