పాలేరు ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా..
(కూసుమంచి-విజయంన్యూస్)
నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్య మొండి వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్రకమిటి పిలుపుమేరకు పాలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో శనివారం పాలేరు ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతల అంజని, పాలేరు నియోజకవర్గ ప్రధానకార్యదర్శి బెల్లి శ్రీశైలం ఆధ్వర్యంలో యువకులు.. నిరుద్యోగులు క్యాంఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కూసుమంచి సీఐ సతీస్, ఎస్ఐ నంధీఫ్ ఆందోళన కారులను అరెస్ట్ చేశారు.