ఆసరాతో ముసలవ్వల మోమున ముసిముసి నవ్వులు : కందాళ
పింఛన్ లబ్ధిదారులకు పత్రాలు పంపిణి చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ
ముసలవ్వల మోమున ముసిముసి నవ్వులు
== వృద్దులు,దివ్యాంగులు,ఒంటరిమహిళల బతుకుల్లో కొత్త వెలుగులు
== “ఆసరా” తో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
== పింఛన్ లబ్ధిదారులకు పత్రాలు పంపిణి చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ
(కూసుమంచి-విజయంన్యూస్)
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ల కార్యక్రమం ముసలవ్వల ముఖంలో ముసిముసి నవ్వులు విరాజిల్లుతున్నాయని, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. వృద్దులు,దివ్యాంగులు, ఒంటరిమహిళల బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని అన్నారు. నేలకొండపల్లి మండలంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి లబ్ధిదారులకు ఇండ్లకు వెళ్లి కొత్త పెన్షన్ల ను లబ్ధిదారులకు అందజేశారు.
ఇది కూడా చదవండి: తెల్దారుపల్లిలో ఆగని ఆందోళనలు
ఎమ్మెల్యే కందాళకు లబ్ధిదారులు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ వృద్దులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు ఆసరా పించన్లు అందజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారన్నారు. ప్రతి పేదింటి వెలుగు కేసీఆర్ మాత్రమేనని అన్నారు. వృద్యాప్యంలో వృద్దులు ఎవరి ముందు చేయిచాచకుండా ఆత్మగౌరవంతో బ్రతికేలా రూ.2016, దివ్యాంగులకు రూ.3016పింఛన్ అందజేస్తున్నారని అన్నారు. సమైక్య పాలనలో రూ.200 పించన్ రావాలంటే కాళ్ళకు చెప్పులరిగేలా తిరగటం,లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు ఫలాలు అందుతున్నాయన్నారు..నూతనంగా రాష్ట్రంలో 10 లక్షల పై చిలుకు లబ్దిదారులకు కొత్త పించన్లు అందజేస్తున్నారని,అర్హత ఉండి రాని వారికి తిరిగి పించన్ అందజేస్తామన్నారు.అర్హులందరికి కొత్త పించన్లు అందుతాయన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదలకు పించన్లు అందిస్తుంటే కొన్ని పార్టీలు ఉచితాలు ఇవ్వకూడదంటూ పించన్లను రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు పేదల ఆత్మబంధువు కేసీఆర్ కు మనమంతా అండగా నిలవాలన్నారు.. కేసీఆర్ నాయకత్వంలో,మంత్రి కే.టీఆర్ మార్గనిర్దేశనంలో ఈ రాష్ట్రం, నియోజకవర్గం సుభిక్షంగా ముందుకుసాగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో ,ముఖ్య నాయకులు,అదికారులు ప్రజా ప్రతినిధులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమ్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, అధికారులు, తదితరులు హాజరైయ్యారు.
ఇది కూడా చదవండి: పాలేరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం
== ఖమ్మం రూరల్ మండలంలో
ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురువారం పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందిజేశారు. మండలంలోని పల్లెగూడెం, పోలేపల్లి, గోళ్ళపాడు, తీర్థాల, పోలిశెట్టిగూడెం, మంగళగూడెం, కామంచికల్, పడమటి తండా, దారేడులో పర్యటించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నూతనంగా మంజూరైన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పంత్రాలను అందజేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ ప్రసాద్, అధికారులు తదితరులు హాజరైయ్యారు.