పాలేరు ఎమ్మెల్యేకు చేదు అనుభవం
== ఇలా చేయోచ్చా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఎంపీటీసీ
== మీమంతే చేస్తామన్నా ఎమ్మెల్యే
== జాగ్రత్త మాట్లాడకపోతే సంగతేంటో చూస్తామంటూ హెచ్చరిక
== నేలకొండపల్లి పింఛన్ల మంజూరు పత్రాల పంపిణిలో రసాభసా
== సోషల్ మీడియాలో తెగచెక్కర్లు కొడుతున్న వీడియో
(నేలకొండపల్లి-విజయంన్యూస్)
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా 57ఏళ్లపై బడిన వారందరికి పింఛన్లను మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరు పత్రాలను పంపిణి చేస్తోంది. ఈ పంపిణి కార్యక్రమం పండుగలా జరుగుతోంది. ప్రభుత్వం అందించే మంజూరు పత్రాలతో పాటు ఐడీ కార్డులను పంపిణి చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో పింఛన్ల పంపిణి కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
ఇది కూడా చదవండి : బ్రేక్ పడుతున్న ‘రామ్ చరణ్,శంకర్’ సినిమా
మీరు ఇలా చేయోచ్చా అంటూ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని ఓ ఎంపీటీసీ ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయా..? అంటూ ఎంపీటీసీ ప్రశ్నించడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఇలాంటోళ్లను చాలా మంది చూశనం, జాగ్రత్తగా మాట్లాడకపోతే సంగతేంటో చేస్తామంటూ హెచ్చరించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. పూర్తి వివారాల్లోకి వెళ్తే నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఏఎంసీ అవరణంలో నూతన పింఛన్ దారులకు మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరైయ్యారు. మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ప్రభుత్వం అందించిన కరపత్రంతో పాటు పాలేరు ఎమ్మెల్యేకు సంబంధించిన కరపత్రాన్ని జతకలిపి పంపిణి చేస్తున్నారు. దీంతో నేలకొండపల్లి ఎంపీటీసీ బొడ్డు బొందయ్య పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరారు. ప్రభుత్వ కరపత్రంతో పాటు ఎమ్మెల్యే స్వంత కరపత్రం పంపిణి చేయోచ్చా అంటూ బొందయ్య పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరుతుండగా ఎమ్మెల్యే అనుచరులు ఎంపీటీసీపై మండిపడ్డారు. మా ఇష్టం మేము అంతే పంచుతాం, ఎమ్మెల్యే కు సంబంధించిన కరపత్రం పంచితే ఏమైతది.. పంచకూడదా..? మర్యాదగా, జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, లేకుంటే చూస్తామంటూ హెచ్చరించినట్లు వీడియోలో ఉంది.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే పీఏలా..? ప్రభుత్వాధికారులా..?
దీంతో స్పందించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఎంపీటీసీ బొడ్డు బొందయ్యను చూసి ఏంటీ నీ గోల ఏంటీ..? ఎందుకు గొడవ చేస్తున్నావు, పంచితే తప్పేంటి, నీలాంటోళ్లను చాలా మందిని చూశామంటూ అన్నారు. దీంతో ఇదేంది సార్, నేను అడిగింది పంచాయతీ కార్యదర్శిని, ఆయన వివరణ తెలుసుకుంటున్నాను. మీ వాళ్లే నన్ను బెదిరించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేకు చెబుతూ ఈ కరపత్రం పంచోచ్చా, పంచకూడదా అని పంచాయతీ కార్యదర్శికి చెప్పుకునే అవకాశం కూడా సర్పంచ్, ఎంపీటీసీలకు లేదా..? అని ప్రశ్నించారు. అలాగే మంజూరు పత్రాలు పంచాయతీ కార్యదర్శి ఇస్తారని ఎమ్మెల్యే గా మీరే చెబుతున్నారు, మరీ ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచ్, ఎంపీటీసీలం ఏం చేయాలి సార్ అంటూ ప్రశ్నించారు. ఏం చేస్తారు..? మేమంతే చేస్తం అంటూ ఎమ్మెల్యే చెప్పడం గమనర్హం. దీంతో నేలకొండపల్లి మండల పింఛన్ల పంపిణి కార్యక్రమం రసాభసాగా మారింది. కొంత సేపు ఉద్రికత్తకు దారితీసింది. అయితే అక్కడ కొంత మంది నాయకులు, పోలీసులు కల్పించుకుని గొడవను సద్దుమనిపించారు.
== నేలకొండపల్లిలో ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న ఎంపీటీసీ వీడియో దిగువనా..