ఇద్దరు ఎంపీలకు, ఎమ్మెల్సీకి అవమానం
== ఉద్యోగం చేయండి..ఊడిగం చేయోద్దని మండిపడిన తాతామధు
== అధికారులతీరు పై ఆగ్రహం
== అసలేం జరిగిందంటే..?
కూసుమంచి, సెప్టెంబర్ 18(విజయంన్యూస్)
ఒకరు ఖమ్మంకు ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత.. మరోకరు రాజ్యసభ సభ్యుడు.. ప్రభుత్వంలో పెద్దలకు అత్యంత సన్నిహితుడు.. ఇంకోకరు ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు.. ముగ్గురు ప్రభుత్వ ప్రతినిధులే.. కానీ ఓ ప్రాంతంలో ఆ ముగ్గురికి అవమానం జరిగింది.. అంతాఇంతా కాదు.. వారే ఆగ్రహం వ్యక్తం చేసే అంతగా మండింది వారికి.. దీంతో ఉద్యోగం చేయండి…ఊడిగం కాదు అంటూ మండిపడిన పరిస్థితి ఏర్పడింది.. ఇంతకు ఆ ముగ్గురికి ఏం అవమానం జరిగింది.. వారేందుకు ఇంతగా రియాక్ట్ అయ్యి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు కథేంటో చూద్దాం పదండి..
allso read- ఆర్టీసి ప్రజల అస్థి : మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న ఉచిత చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి, ఎమ్మెల్సీ తాతామధుసూదన్, పల్లా రాజేశ్వరర్ రెడ్డి, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలను మత్స్యశాఖాధికారులు ఆహ్వానించారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేరే పర్యటనలో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతామధుసూదన్ హాజరైయ్యారు. అయితే పాలేరు జలాశయం వద్దకు వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్సీకి అధికారులు షాక్ ఇచ్చారు.. వారు కూడా ఊహించని షాక్ ఇచ్చారు. ఏంటంటే..?
allso read- టీఆర్ఎస్, బీజేపీలకు స్వాతంత్రపై మాట్లాడే హక్కులేదు: భట్టి విక్రమార్క
అతిథులు కార్యక్రమానికి వస్తున్నప్పుడు కచ్చితంగా వారి పోటోలతో ప్లెక్సీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు కచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.. ఇది సాధాహరణ డ్యూటీ మాత్రమే.. వారిని గౌరవించుకోవడం అని కూడా అంటారు. కానీ పాలేరు జలాశయంలో ఉచిత చేపపిల్లల పంపిణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మత్స్యశాఖాధికారులు మాత్రం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్లెక్సిలు మాత్రమే ఏర్పాటు చేసి వదిలేశారు. దీంతో చేప పిల్లల పంపిణి కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్సీ ఆ ప్లెక్సీలను చూసి ఆగ్రహించారు. ఫ్లెక్సీలు కట్టలేదని జిల్లా మత్స్య శాఖ అధికారిపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు ఆఫీసర్ల మాదిరిగా ఉండాలని, పనికిమాలిన పనులు చేయొద్దని, ఎవరికో ఊడిగం చేయడానికి ఉండొద్దని ఘాటుగా హెచ్చరించారు. ఓన్లీ ఎమ్మెల్యేకు, మంత్రికే ఎందుకు ఫ్లెక్సీలు కట్టారు..
allso read- 18న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మానం
మిగతా వాళ్లకు ఎందుకు కట్టలేదు.. ఉద్యోగం చేయండి… ఎవరికీ ఊడిగం చేయెద్దు… మాకు లేని ఫ్లెక్సీలు మిగతావాళ్ళ కెందుకు…ఎమ్మెల్యే మంత్రికే ఫెక్సీలెందుకు… అలా చేయమని ప్రభుత్వం చెప్పిందా… మాట్లాడనా మీ కమీషనర్ తో.. చేయండి కార్యక్రమం ఎలా చేస్తారో చూస్తామంటూ ఖమ్మం జిల్లా మత్స్యసహాకార అధికారి పై విరుచుక పడ్డారు ఎమ్మెల్సీ తాతా మధు… పాలేరు జలాశయంలో చేపపిల్లల విడుదల కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు నామా, వద్ధిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. దీంతోఅక్కడున్నవారంతా షాక్ కు గురైయ్యరు. అనంతరం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ బానోతు శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు చేప పిల్లలను జలాశయంలో విడుదల చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.