*పాత కాలువ పై పొర్లుతున్న నీళ్ళు*
** మునిగిపోతున్న పోలాలు
(కూసుమంచి-విజయం న్యూస్)
పాలేరు పాత కాలువపై నీళ్ళు పొంగిపోర్లుతున్నాయి.. కాలువ నిండా నీళ్ళు ప్రవహిస్తుండటంతో అక్కడక్కడ చిన్నపాటి గండ్లు పడుతున్నాయి.. దీంతో కాలువ నుంచి నీళ్ళు ఎక్కువగా పొంగిపోర్లుతుండటంతో దిగువున ఉన్న వరి పంట మునిగిపోతున్నాయి..దీంతో రైతులు నష్టపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
కూసుమంచి మండలం పరిధిలోని మల్లాయిగూడెం గ్రామంలో 4వ తూము సమీపంలో మళ్లీ పాత కాలువకు గండి పడినట్లు తెలుస్తోంది. కాలువకు భారీగా నీరు విడుదల చేస్తుండటంతో కాలువపై నీళ్ళు పొంగిపోర్లుతున్నాయి. దీంతో రైతుల సాగు చేసిన పంట పొలాలు నీట మునగడంతో రైతులు గండి పూడ్చాలని అధికారులను కోరుతున్నారు.