Telugu News

పాలేరు జలాశయంలో నిమజ్జనాలు బంద్.

50ఏండ్ల అనువాయితీకి పుల్ స్టాఫ్

0

పాలేరు జలాశయంలో నిమజ్జనాలు బంద్.

==  ఘాట్ వద్ద బారికేడ్లు, కంప చెట్లు వేసిన గ్రామపంచాయితీ

== 50ఏండ్ల అనువాయితీకి పుల్ స్టాఫ్

కూసుమంచి, సెప్టెంబర్ 7(విజయంన్యూస్)

వినాయక చవితి వచ్చిందంటే పాలేరు జలాశయం వద్ద ఎంతో సందడి కనిపించేది.. విగ్రహ ప్రతిష్ట అనంతరం మూడవ రోజు నుంచి పాలేరు జలాశయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది..

Allso read:- వినాయక నిమజ్జనం ఎప్పుడు..?

ఇక నిమజ్జనం ఐదు రోజులు ఉందనగా మండల స్థాయి, జిల్లా స్థాయి అన్ని శాఖలాధికారులు పాలేరు జలాశయంకు వచ్చి పరిశీలించి ఏర్పాట్ల గురించి చర్చించి వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉండేది. నిమజ్జనం రోజున కూసుమంచి మండలంతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి పేద్ద ఎత్తున వస్తున్న వినాయక విగ్రహలతో పాలేరు ట్యాంక్ బండ్ కళకళలాడుతుండేది. సుమారు రెండు రోజుల పాటు జరిగే నిమజ్జనం కార్యక్రమంతో ఎంతో సందడిగా ఉండేది. ఎన్నో ఏళ్లుగా ఆచారంగా వస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 50 ఏళ్ల నుంచి పాలేరు జలాశయంలో విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు.  అంతేకాదు.. పోలీసులకు, అధికారులకు టెన్షన్..టెన్షన్ గా ఉండేది. ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉండేది.. గతంలో ట్రాక్టర్ ప్రమాదంలో 10మంది భక్తులు చనిపోగా, ఆప్రమాద ఘటన ప్రతి నిమజ్జన సంఘటన సమయంలో భయాందోళనకు గురి చేస్తుండేది.. అయితే ఒక్క సారి మినహా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాంటిది అచారంగా వస్తున్న పండుగను ఎందుకు అధికారులు నిలిపివేశారు..? కారణమేంటి..?పాలేరు జలాశయంలో నిమజ్జనాలను ఎందుకు నిలిపివేశారు..?

== పాలేరు జలాశయంలో నిమజ్జనాలు బంద్

పాలేరు జలాశయంలో గత 50ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమానికి అధికారులు చెక్ పెట్టారు.

Allso read:- ఖమ్మంకు వచ్చిన ‘ఇస్మాట్ శంకర్’

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు పాలేరు జలాశయం వరకు విగ్రహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో ఆయా గ్రామాల భక్తులు సమీప చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కలెక్టర్ ఉత్తర్వులతో పోలీస్, రెవిన్యూ అధికారుల మౌఖిక అదేశాలతో గణనాధుల నిమర్జనాలకు బ్రేకులు వేశారు. గ్రామాలలో చెఋవులలో నీరు పుష్కలంగా ఉండటంతో ఎక్కడికక్కడే నిమజ్జనాలు చేయాలని ఆదేశించారు.

== ఎందుకోసమంటే..?

ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద జలాశయం పాలేరు జలాశయం.. ఈ జలాశయం నుంచి లక్షలాధి క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లుంటాయి.. అంతే కాదు.. పాలేరు జలాశయం నుండి సుమారు 100 గ్రామాలకు మిషన్ భగీరధ పథకం ద్వారా నీటిని  వినియోగిస్తున్నారు. అయితే వినాయక విగ్రహాలు రసాయిన విగ్రహాలు కావడం అవి నీటిలో కరిగి ఉన్న నీరంతా కలుషితమైయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు.  ప్రజారోగ్యం దృష్ట్యా వినాయక విగ్రహాలను నిలిపివేస్తే బాగుంటుందని భావించిన అధికారులు పాలేరు జలాశయంలో విగ్రహాల నిమజ్జన  నిలిపివేసినట్లు తెలుస్తోంది.

allso read:- పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా

అయితే తాగునీటి పేరుతో భక్తులను ఇబ్బందులకు గురి చేయడమే ఈ ప్రభుత్వ పని పలువురు విమర్శిస్తున్నారు. హిందువుల పండుగ అంటే ప్రభుత్వాధికారులకు చిన్నచూపైందని, ఆరోపిస్తున్నారు. 50ఏళ్ల నుంచి చనిపోని ప్రజలు ఇప్పుడే చనిపోతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎన్ఎస్పీ అధికారులను వివరణ కోరగా మంచినీటి అవసరాల నిమిత్తం ఉపయోగించే నీటిని కలుషితం చేయోద్దనే ఆలోచనతో విగ్రహాల నిమజ్జనంను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.