Telugu News

పల్లెబాటన కాంతన్న.. పరామర్శల యాత్రలో పాయం.

** పినపాక పీఠం కోసం నేతల పాట్లు

0

పల్లెబాటన కాంతన్న.. పరామర్శల యాత్రలో పాయం

** పినపాక పీఠం కోసం నేతల పాట్లు

** శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేతలు

** పల్లె బాటలో కాంతన్న

** పరామర్శ యాత్రలతో పాయం చక్కర్లు

** నాయకత్వ లేమీ లో కాంగ్రెస్.

** ఉలుకూ పలుకూలేని వామపక్షాలు

(మణుగూరు-విజయం న్యూస్)

రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తో పాటు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పావులు కదుపుతున్నారు. పినపాక పీఠం కోసం పోటీపడుతూ ఎవరికి వారే అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా విజయం సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు నిమగ్నమయ్యారు ఇప్పటి నుంచే శక్తియుక్తులను తమ అనుచర వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ ఎన్నికలపై ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. కాగా అపార ఖనిజ వనరులు పారిశ్రామిక ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో ఇప్పటివరకు అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన దాఖలాలు మచ్చుకైనా లేవు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన  నియోజకవర్గం నుండి నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను సాధించిన యువకుడు రేగా కాంతారావు తన ప్రత్యర్థి సమీప సిపిఐ పార్టీ కి చెందిన వెంకటేశ్వర్లు పై విజయ ఢంకా మోగించారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం తోపాటు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేశారు కాగ 2014 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్  ఆశించిన రేగు కు భంగపాటు ఎదురయింది పొత్తులో భాగంగా పార్టీ హైకమాండ్ నిర్ణయంతో స్థానాన్ని సిపిఐ పార్టీకి కేటాయించడంతో రేగాకు చుక్కెదురైంది. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్ తన సొంత చరిస్మా తో వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు.

నూతనంగా ఏర్పడిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కాదా మారిన రాజకీయ పరిణామాల్లో పాయం వైఎస్ఆర్ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు 2014 నుండి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రేగా కాంతారావు నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు అహర్నిశలు శ్రమించారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ నిద్ర పేరుతో గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ఆయన తరఫున అధికారపార్టీ వైఫల్యాలను జనాల్లో తీసుకుని వెళ్లడం సఫలీకృతం అయ్యారు. నాటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పై అసంతృప్తి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి దందా పాయం ప్రతిష్టకు తీరని మచ్చ ల మిగిల్చాయి 2019 శాసనసభ ఎన్నికల్లో రేగా కాంతారావు అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్పై పాయం తిరిగి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాయం పై నియోజకవర్గ ప్రజల్లో ఉన్నా వ్యతిరేకత ఆయన ఓటమికి ప్రధాన కారణమైంది.

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రేగా గులాబీ కండువా కప్పుకోవడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులు ఆయన వెంట నడిచారు. అధికార పార్టీ లోకి రేగా అడుగు  పెట్టడంతో మాజీ ఎమ్మెల్యే పాయం ప్రస్తుత ఎమ్మెల్యే రేగా వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. పైకి మాత్రం ఒకటి గా కనిపిస్తున్న లోపల మాత్రం ఎవరికి వారేలా తిరిగి వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే పదవి కోల్పోవడం తో పాయం వర్గం లో ఒక్కొక్కరూ రేగా పంచన చేరారు. డీలా పడ్డ పాయం గత మూడు సంవత్సరాలుగా ఇంటికే పరిమితమయ్యారు ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలతో అనుచర వర్గీయులు వచ్చే ఎన్నికల లక్ష్యంగా కాయం పనిచేయాలని ఒత్తిడి పెంచడంతో తిరిగి పాయం యం తన అనుచరులతో మంతనాలు సాగిస్తూ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరుస పర్యటన చేస్తూ కార్యకర్తలకు ప్రజలకు చేరువయ్యే  పనిలో నిమగ్నమయ్యారు మరోవైపు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గా కీలక బాధ్యతలో కొనసాగుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా  క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేగా కాంతారావు రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుండే గెలుపు కోసం గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గం వర్గంలోని పల్లెల్లోని సమస్యలు పరిష్కరించేందుకు రేగన్న పల్లె బాట పడుతున్నారు బుధవారం ముదినేపల్లి పంచాయతీలోని రెడ్డి గూడెం గ్రామంలో ఇంటింటికి కేసీఆర్ పల్లెపల్లెకూ తెరాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకో న్నారు.

** చుక్కాని లేని నావల కాంగ్రెస్…?

పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై విజయం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కాంతారావు కాంగ్రెస్ పార్టీని వేయడంతో నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో చుక్కాని లేని నావలా తయారైంది. బలమైన క్యాడర్ కలిగిన పార్టీని ముందుకు నడిపితే నాథుడే లేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది గల్లీకో నేత కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని చెబుతున్న పార్టీ లో కొత్తగా చేరిన నాయకులు పార్టీని పట్టించుకోకుండా కేవలం వసూళ్లకు పరిమితమవుతున్నరనే విమర్శలు ఆ పార్టీ కి చెందిన సొంత నాయకుల నుండే వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బండి ఱ వరకు ఇప్పటినుండే ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ యువ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ సాధించేందుకు ఢిల్లీలోని నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా నిమగ్నమయ్యారనే

ప్రచారం జోరుగా సాగుతుంది. నియోజకవర్గంలోని గ్రామ స్థాయి నాయకులను కలుస్తూ ఆదివాసి గ్రామాలలో పెద్దలను కలుస్తూ తనకు సహకరించాలని కోరుతున్నట్లు సమాచారం.

** ఉలుకూ పలుకూలేని వామపక్షాలు…

నాటి బూర్గంపాడు నేటి పినపాక నియోజకవర్గం లో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగిన వామపక్ష పార్టీలు నేడు ఉనికి కోసం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సిపిఐ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గంలో పలుమార్లు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వరుస పరిణామాలలో పార్టీలో నాయకత్వ లోపంతో కార్యకర్తలు క్యాడర్ పార్టీని వీడడం, అనుకున్న స్థాయిలో ప్రజా ఉద్యమాలను  నిర్మించి ప్రజలతో మమేకం కావడం లో వామపక్షాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారుతున్న పరిణామాల తో అధికార .మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలు ఎటువైపు దారితీస్తాయని ఆసక్తి సర్వత్ర నెలకొంది అధికార పార్టీలోనే మాజీ ఎమ్మెల్యే పాయం ,రేగా వర్గీయుల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ఎవరు పైచేయి సాధించి పినపాక పీఠంపై పట్టు సాధిస్తారని ఉత్కంఠకు తెరపడే పరిస్థితులు ప్రస్తుతం  కనిపించడం లేదు. పినపాక పీఠం కోసం నేతల పాట్లు ఎటువైపు దారితీస్తాయో గమనించాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలే సమాధానంగా కనిపిస్తున్నాయి.

also read:-ప్రయాణం… నిత్య నరకం…!