Telugu News

పల్లెల్లో కాంగ్రెస్ సభ్యత్వ పండుగ

ఎర్రుపాలెం మండలంలో ముమ్మరంగా కాంగ్రెస్ సభ్యత్వం

0

పల్లెల్లో కాంగ్రెస్ సభ్యత్వ పండుగ

ఎర్రుపాలెం మండలంలో ముమ్మరంగా కాంగ్రెస్ సభ్యత్వం

ఎర్రుపాలెం, 
ఈ రోజు మండలంలోని ఎర్రుపాలెం, బనిగండ్లపాడు, నరసింహాపురం, మామునూరు, చొప్పకట్లపాలెం, భీమవరం ఎస్సీ కాలన తదితర గ్రామాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డిసుధాకర్ రెడ్డి, సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ పెండ్ర అంజయ్యఆధ్వర్యంలో పల్లెపల్లెన విస్తృతంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్ చార్జ్ పెండ్ర అంజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి వయస్సుతో సంబంధం లేకుండా ప్రమాద బీమాను ఇవ్వనున్నట్లు తెలిపారు.

also read :-★ గ్రానైట్ పరిశ్రమల సమస్యలకు ప్రభుత్వం చెక్

అందుకే ప్రజలందరు తప్పకుండా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలందరు మక్కువ చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీను, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు తలపురెడ్డి నాగిరెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ కె జానీ భాషా, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దేవరకొండ శీను సంబంధిత గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొనడం జరిగింది.