Telugu News

పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బూత్ పురాణం

నేనేవ్వరో తెలుసా..?బట్టలూడతయ్.. ఇరికించేస్తా అంటూ బెదరింపులు

0

పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బూత్ పురాణం

== నేనేవ్వరో తెలుసా..?బట్టలూడతయ్.. ఇరికించేస్తా అంటూ బెదరింపులు

== సీఐకి పోన్ చేసి లోపలేయ్ అంటూ హుకుం జారీ

== ఫిర్యాదు ఇవ్వండి లోపలేస్తానన్న సీఐ..?

== ఆర్టీఐ వేసిన దళితుడ్ని బెదిరించిన టీఆర్ఎస్ ప్రజాప్రజాప్రతినిధి

== సంచలనంగా మారిన బూతు పురాణం ఆడియో

== సోషల్ మీడియాలో చక్కర్లు

కూసుమంచి, ఆగస్టు 13(విజయంన్యూస్)

ఏం పేరే నీపేరు..? ఏం కావాలి నీకు.. గు… బలిసి ఏడుస్తున్నవా..? పనికిమాలిన మాటలు.. నీకు అనుకుంటున్నవేమో..?ఎవరనుకుంటన్నవో..ఏం అనుకుంటున్నవో.. పిచ్చిపిచ్చి చెకలు దెం..తే..? బట్టలూడతయ్.. ఆర్టీఐ నీకు ఏం సంబంధం.. లోపలే దెం..తా… లంగా ఎవరమేంటి..? డబ్బులడగుతున్నవంటగా..? నీ పేరేమిటీ..? ఒక్క నిమిషం లైన్లో ఉండూ అంటూ ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఆర్టీఏ వేసిన వ్యక్తిపై బూతు పురాణం ప్రారంభించాడు.. ఎదుట వ్యక్తి మర్యాదతో మాట్లాడుతున్నప్పటికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడిన ఆడియో ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అనుచరుడు పోన్ కలిపించి బెదరించి.. ఆ తరువాత లైన్లోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఆర్టీఏ వేసిన దళితుడిపై బూతు పురాణం ప్రారంభించిన సంఘటన కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది.

ALLSO READ- తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన

ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి బూతు పురాణం ఆడియో  ఇప్పుడు సంచలనంగా మారింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వనమా రాఘవేంద్ర సంఘటన మరవక మునుపే మరో ఆడియో సంఘటన బయటకు రావడంతో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా, ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన ఆర్టీఐ వేసిన ఓ దళితుడిపై అగ్రహం వ్యక్తం చేస్తూ నోటికి వచ్చినట్లు తిట్టిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం ఉదయం నాటికే అన్ని గ్రూపులలో చక్కర్లు కొడుతోంది.. ఆయనేవ్వరంటే..?

== పంచాయతీ  నిధులపై ఆర్టీఏ వేసిన దళితుడు..?

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామ పంచాయతీ నిధులు, ఖర్చుల వివరాలు తెలుసుకునేందుకు గాను మధిర నియోజకవర్గం ముదిగొండ మండలానికి చెందిన డి.సురేష్ అనే దళితుడు ఏప్రిల్ లో గత కొద్ది రోజుల క్రితం సమాచారా హక్కు చట్టం ద్వారా వివరాలు కావాలని జీళ్ళచెరువు పంచాయతీ కార్యదర్శి వినతి చేశారు. కొద్ది రోజులైన ఇవ్వకపోవడంతో ఆయన ఎంపీవోకు మరోసారి వినతి చేశారు. దీంతో ఎంపీవో ఆ లేఖను జీళ్ళచెరువు పంచాయతీ కార్యాలయంకు సిపారసు చేశారు. అతితక్కువ కాలంలోనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ విషయం డీసీసీబీ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఇంటూరి శేఖర్ కు అందినట్లుంది. ఈ మేరకు ఆగ్రహించిన ఆయన తన అనుచరుడైన గ్రామ పంచాయతీ కోఆప్షన్ మెంబర్ గా పనిచేస్తున్న ఐతగాని రాంగోపాల్ పోన్ కలిపి ఎవరు నువ్వు.. ఏం చేస్తుంటావు..? నీకు సమాచారం కావాలా..? అయితే ఆపీసుకు రా ఇస్తాం.. ఇవ్వాల్సిన అవసరం లేదులే గానీ నేను కోఆప్షన్ మెంబర్ ను నీకు ఎందుకు ఇవ్వాలి అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆ వీడియోలో ఉంది.

== ప్రారంభంలోనే బూతుపురాణం.. బెదిరింపులు

ఒక్క నిమిషం లైన్లో ఉండు అంటూ రాంగోపాల్  ఇంటూరి శేఖర్ కు పోన్ ఇవ్వగా ఏం పేరే నీపేరు…నేను ఇంటూరి శేఖర్ని మాట్లాడుతున్న ఏం పేరు నీపేరు..నీకేం కావాలి..?ల..డలో ఉంది.. గు..బలిసి వేడుస్తన్నవా.?ఏం మాట్లాడుతున్నవే నువ్వు ఎవడివే వచ్చి ఇక్కడ కుర్చోవాలి కానీ నువ్వేవ్వడివా..?..పనికిమాలిన మాటలు. రా నీకు ఏం అనుకుంటున్నవేమో..?ఎవరనుకుంటన్నవో..ఏం అనుకుంటున్నవో.. పిచ్చిపిచ్చి చెకలు దెం..తే..? బట్టలూడతయ్.. ఆర్టీఐ నీకు ఏం సంబంధం.. లోపలే దెం..తా… లంగా ఎవరామేంటి..? డబ్బులడగుతున్నవంటగా..? నీ పేరేమిటీ..? ఒక్క నిమిషం లైన్లో ఉండూ అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆడియో స్పష్టంగా చెబుతోంది..

ALLSO READ- ఇంటింటికి జాతీయజెండాలను పంపిణి చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి

== అతన్ని లోపలేయ్…? అంటూ సీఐకి హుకుమ్

నమస్తే అన్న.. ముదిగొండ మండలం, యడవల్లి గ్రామం డి.సురేష్ అంటా.. బాగా ఓవర్ చేస్తుండూ.. లోపలేయ్ అంటూ ఖమ్మం రూరల్ సీఐకి పోన్ కలిపి హుకుం జారీ చేసినట్లు ఆ వీడియోలో వినిపిస్తోంది.. ఆర్టీఐలు వేయడం.. డబ్బులు వసూళ్లు చేయడం లం..కొడుకులు.. పిటిషన్ ఇప్పిస్తా గానీ ముదిగొండ ఎస్ఐ కి పోన్ చేసి లోపలేయ్ అంటూ ఆయన పోన్లో చెబుతుండగా, సీఐ స్పందించి పిటిషన్ ఇప్పించండన్నా..లోపలేస్తా అంటూ చెప్పినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది.. ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది..

== సురేష్ పై ఫిర్యాదు చేసిన జీళ్ళచెరువు సర్పంచ్..?

జీళ్లచెరువు పంచాయతీ వివరాలు కావాలని ఆర్టీఐ వేసిన సురేష్ పై జీళ్ళచెరువు పంచాయతీ సర్పంచ్ కొండా సత్యం కూసుమంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాలు అడిగిన సురేష్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని విజయం పత్రిక ప్రతినిధి సర్పంచ్ కొండా సత్యంను వివరణ కోరగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది.

== బెదిరిస్తున్నారు.. : సురేష్

ఆర్టీఐ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం వల్ల నేను ఫై అధికారికి అపిల్ చేశాను. దీనికి పంచాయతీ కోఆప్షన్ మెంబర్ ఐతగాని రాంగోపాల్, ఇంటూరి శేఖర్ నాకు పోన్ చేసి బెదిరిస్తూ బూతులు తిడుతున్నారని ఆర్టీఐ పిటిషనర్ డి.సురేష్ తెలిపారు. నేను పోన్లో మాట్లాడుతుంటూనే సీఐకి పోన్ చేసి వెంటనే వాడ్ని లోపలేయ్ అంటూ బెదిరిస్తున్నారని,  నాకు ప్రాణహాణి ఉందని ఆయన విజయం ప్రతినిధికి తెలిపారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది. చూడాలి ఈ విషయంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారా..? లేదంటే రాజకీయంగా పెద్ద తలలు పూనుకోని మాపీ చేస్తారా..ఎలా స్పందిస్తారో? చూడాలి..?

సురేష్ తో ఇంటూరి శేఖర్ పోన్లో మాట్లాడుతున్న  ఆడియో దిగువున