Telugu News

పాన్ కట్టిన పొంగులేటి

ఖమ్మంలో ముమ్మరంగా ప్రచారం

0

పాన్ కట్టిన పొంగులేటి

=== ఖమ్మంలో ముమ్మరంగా ప్రచారం

(ఖమ్మం-విజయం న్యూస్):

తమలపాకు చేతపట్టి.. చక్కగా చివరలు కత్తిరించి.. సున్నం పూసి.. వక్కలు వేసి ఆహా.. కిల్లీ మస్త్ అనేట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ పాన్ షాప్ లో ఇలా అబ్బుర పరిచారు. సోమవారం రాత్రి నగరంలోని తుమ్మల గడ్డ సెంటర్ లో మైనారిటీల సమ్మేళనానికి వస్తూ.. రోడ్డు వెంట ఉన్న మదీనా పాన్ షాప్ నకు వెళ్లారు. భాయ్.. ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ.. కౌంటర్ టేబుల్ వద్ద తమలపాకు తీసుకొని స్వయంగా ఓ పాన్ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంక్షేమ పాలనకు అడ్డు వచ్చే విపక్షాల వారిని నిలువరిద్దామని సందేశం ఇచ్చారు. మంత్రి వెంట మైనారిటీ నాయకులు ఎండీ. ముస్తఫా, మియా భాయ్ తదితరులు ఉన్నారు.