గౌడకులాన్ని ప్రపంచానికి సాటిచెప్పింది పాపన్న
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని అవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
గౌడకులాన్ని ప్రపంచానికి సాటిచెప్పింది పాపన్న
== సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని అవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఖమ్మం ప్రతినిధి, సత్తుపల్లి, ఏప్రిల్ 29(విజయంన్యూస్):
గౌడ కులాన్ని, కులస్తులను ప్రపంచానికి సాటిచెప్పింది సర్వాయి పాపన్నగౌడ్ అని, కులస్తుల జీవితాలు మార్చి గౌడ కులస్తులందరికి దేవుడైయ్యారని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలసి శనివారం సత్తుపల్లి గంగారంలో ఏర్పాటు చేసిన విగ్రహన్ని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
allso read- క్రీడాలను ప్రోత్సంహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి శ్రీనివాస్ గౌడ్
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బేతుపల్లి గంగారం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎక్సేంజ్ అండ్ ప్రొహిబిషన్ యువజన సర్వీసులు పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ముందుగా ఆయన చేతుల మీదుగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ శిలాఫలకాన్ని, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందించిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అలనాటి మహావీరుల సేవలను భవిష్యత్ తరాలకి అందించేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.