Telugu News

పరామర్శలు – ఆశీర్వాదాలు – ఆర్థికసాయాల్లో పొంగులేటి బిజిబిజి

ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో పొంగులేటి పర్యటన

0

పరామర్శలు – ఆశీర్వాదాలు – ఆర్థికసాయాల్లో పొంగులేటి బిజిబిజి
– ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో పొంగులేటి పర్యటన
– క్యాంప్ కార్యాలయంలో పలు దేవాలయాలకు విరాళాలు అందజేత
– నోటి ద్వారా పెన్సిల్ తో పొంగులేటి చిత్రపటాన్ని గీసిన వికలాంగ యువతికి అభినందన

(ఖమ్మం-విజయంన్యూస్):

తెరాస రాష్ట్రనాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో శనివారం పర్యటించారు. తొలుత క్యాంపు కార్యాలయంలో వివిధ సమస్యలతో బాధలుపడుతున్న పలువురు బాధితులకు ఆర్థికసాయాన్ని అందజేశారు. రెండు జిల్లాల్లోని పలు మండలాలకు చెందిన గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న పలు దేవాలయాలకు ఆయా మండల నాయకుల చేతుల మీదుగా విరాళాలను అందజేశారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పలువురు పేదవిద్యార్థులకు ఆర్థికసాయం అందించారు.

== ఇది కూడా చదవండి :గుండాల ఎంపీటీసీ ఎస్ కె సంధాని మృతి

అదేవిధంగా రెండు చేతులు లేకపోయినా తన నైపుణ్యంతో పొంగులేటి దంపతుల చిత్రాన్ని నోటి ద్వారా పెన్సిల్ తో గీసి కానుకగా అందజేసిన శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం ఆముదాలవలస గ్రామానికి చెందిన యువతి స్వప్నికను ప్రత్యేకంగా అభినందించారు. కబడ్డీ పోటీల సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన టీషార్ట్లను పొంగులేటి ఆవిష్కరించారు. అనంతరం ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్, శుక్రవారపుపేట, వీడియోస్ కాలనీ, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లోని పలువురు బాధితులను పరామర్శించారు. ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం, సత్యనారాయణపురంలో జరిగిన పలు శుభ, అశుభ కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. కొణిజర్ల మండలంలోని అమ్మపాలెంలో వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు మేనత్త కుమారుడు దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

ఇది కూడా చదవంఢి: విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్

పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో పొంగులేటి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, మియాభాయ్, చల్లా రామకృష్ణరెడ్డి, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, చింతమళ్ల గురుమూర్తి, కొడాలి గోవిందరావు, ఉమ్మినేని కృష్ణ, గుడిపూడి రజనీకాంత్, మొగిలిచర్ల సైదులు, డాక్టర్ కొలిశెట్టి నరేష్, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి , జాన్ రెడ్డి , మెండె వెంకటేష్ యాదవ్, పాల నాగేశ్వరరావు, పండిట్, శేఖర్ యాదవ్, ఎయిర్టెల్ నరసింహారావు, కానుగుల రాధాకృష్ణ, కాంపాటి రమేష్, తిరుమలరెడ్డి, గౌస్, చిలుకోటి శ్రీను, గని, రెహమాన్ భాయ్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం లో మంత్రులకు నిరసన సెగ