Telugu News

పరమత సహనంతో మెలగాలి : మంత్రి పువ్వాడ..

◆ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుంది.

0

పరమత సహనంతో మెలగాలి : మంత్రి పువ్వాడ..

◆ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుంది.

◆ అన్ని మతాల వారు స్వేచ్ఛగా వారి ఇష్ట దైవలను పూజించే హక్కు ఉందని క్రిస్మన్ దుస్తుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో మెలిగే దేశం భారతదేశమని, పరమత సహనం భారతీయతకు మారుపేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేద క్రైస్తవులకు అందిస్తున్న దుస్తులను ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ లోని సహకార నగర్ చర్చ్ నందు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి ఉచిత దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..

క్రీస్తు యేసు ప్రభు మనలను కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడని, ఆ ప్రభువు వచ్చింది మత మార్పిడి కోసం కాదని.. కేవలం మనుషుల మనస్తతత్వాలను మార్చడానికే ఈ లోకానికి వచ్చాడని అన్నారు. క్రీస్తు యేసు ప్రభువు మార్గం అనుసరనియమని, ఒకే పండుగను యావత్ ప్రపంచం మొత్తం జరుపుకునేది క్రిస్మస్ అని పేర్కొన్నారు.మనలను సన్మార్గంలో నిలిపి, మనకు రక్షణను కల్పించడానికి యేసు లోకానికి వచ్చాడని, మనుషులలో ప్రేమ, శాంతి, సమాధానం నింపడానికి వచ్చారే తప్పా.. మతం మార్పిడి చేయడానికి రాలేదన్నారు.క్రీస్తు పుట్టినరోజు అయిన క్రిస్మన్ సందర్బంగా ఆ ప్రభువు దీవెనలు మీ అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం క్రిస్మస్ పండుగను ప్రతి ఇళ్ళు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి కులానికి, ప్రతి మతాలను గౌరవించి ప్రతి ఇంటికి సంకేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.

మతాలకు అతీతంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మన భారతదేశంలోనే నెంబర్ వన్ ఉన్న ఓకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు.

మతాలకు అతీతంగా ప్రతి పండగలో మన ప్రభుత్వం భాగస్వాములై ఒకే కుటుంబం వలే సంతోషంగా పండుగ జరుపుకోవాలి అని కేసీఆర్ భావించారని అన్నారు.

అనంతరం వచ్చిన క్రిస్టియన్ సోదరులకు సోదరీమణులకు దుస్తుల పంపిణీ చేశారు.

also read :-కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు కొట్టిన వైరా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ