Telugu News

గురుకులసిబ్బంది అనుచిత ప్రవర్తన తో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ని పరార్

అశ్వారావుపేట విజయం న్యూస్

0

గురుకులసిబ్బంది అనుచిత ప్రవర్తన తో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ని పరార్

(అశ్వారావుపేట విజయం న్యూస్):-

*నిమ్మకు నీరెత్తినట్లుగా సిబ్బంది ప్రవర్తన
*తమ తప్పు కప్పిపుచ్చుకోవాడికి ఎదురుదాడి
*పోలీస్ స్టేషన్ లొ పిర్యాదు
* విలేఖర్లను కూడ లోపలకి రానివ్వకుండా తాళం
*సిబ్బంది విద్యార్దిని తల్లిదండ్రులు లపై భూతుపురాణం

అశ్వారావుపేట లోని మహాత్మ జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలొని సిబ్బంది అనుచిత ప్రవర్తనతో ఓ విద్యార్దిని పారిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పాఠశాల ప్రిన్సిపాల్, ఆంగ్ల బాషా ఉపాద్యాయని ,వాచ్మెన్ పై ఆ విద్యార్దిని తండ్రి పోలీస్ స్టేషన్ లొ పిర్యాదు చేసారు.ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి
కొణిజర్ల మండలం రామనర్సయ్య నగర్ కి చెందిన గౌసి జంపన్న కుమార్తె స్దానిక మహత్మజ్యోతి రావు ఫూలే గురుకుల పాఠశాల లొ పదవ తరగతి చదువుతున్నది.

also read :-భట్టి విక్రమార్క పాదయాత్ర చరిత్రాత్మకమైనది

ఆమె ఏడవ తరగతి నుండే గురుకుల పాఠశాల విద్యార్దిని.ఇటీవల కాలం లొ ప్రిన్సిపాల్ స్వప్న,ఇంగ్లీష్ గెస్ట్ టీచర్ రూపిణి,నైట్ వాచ్ మెన్ మిరాబీలు టార్చర్ పెడుతు,తన కుమార్తె ను సైకొ అని పిలుస్తూ మానసికంగా,శారీరకంగా వేదిస్తున్నారని,అమె తండ్రి ఆరోపించారు. తన కుమార్తె స్నేహితులు కూడ సైకో అంటు ఏడిపిస్తున్నారన్నారు.ఈ భాద పడలేక సోమవారం అర్ధరాత్రి హస్టల్ నుండి పారిపోయిందని,మంగళవారం సాయంకాలం వరకు పాఠశాల సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించారని,మధ్యాహ్నం తనకు ఆంగ్ల బాష ఉపాద్యాయని రాజేశ్వరి ఫోన్ చేసి మీ అమ్మాయి కనపడటం లేదని చెప్పిందన్నారు.

also read :-ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాలు,

తన కుమార్తె అడవిలొ ఇరవై గంటలు గడిపి, సమీప గుర్రాల చెరువు గ్రామస్థుల సహయంతో తనకు ఫోన్ చేసి విషయం చెప్పిందని,నేను,నా భందువులు హుటాహుటిన వచ్చి,స్దానిక పోలీస్ సహాయం తో అమ్మాయిని,హస్టల్ కి తీసుకొనిరాగ ,హస్టల్ లొని సిబ్బంది భర్తలు,ప్రిన్సిపాల్ నానా దుర్బాషలాడుతు,చేయిచేసుకొన్నారని ఆరోపించారు. తమ తప్పును కప్పి పుచ్చుకోవటానికై ఈ విధమైన ఎదురు దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రిన్సిపాల్, వాచ్మెన్,ఇంగ్లీషు గెస్ట్ ఉపాద్యాయని పై పిర్యాదు చేస్తు పోలీస్ స్టేషను లొ ఇచ్చారు.
వివరణకై...

ఈ విషయం తెలిసిన విలేఖర్లు పాఠశాల వద్దకు చేరుకోగా ఎవ్వరిని లోనికి రానివ్వకుండా తాళం వేయడం జరిగింది.ఈ విషయమై స్దానిక ఎస్.ఐ ద్రుష్టికి తీసుకెళ్ళి, అమె సమక్షంలో విలేఖర్ల అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పటం జరిగింది.వందలాది యువతులు చదువుతున్న ఈ పాఠశాల సిబ్బంది ప్రవర్తన పట్ల పలువురు గర్హిస్తు,ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.