Telugu News

ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తారా ? : ఎంపీ నామ

తక్షణమే ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలి

0

ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తారా ? : టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఎంపీ నామ

👉తక్షణమే ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలి

👉 గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన గళం

👉 ప్రజా సమస్యలపై మరింత దూకుడు పెంచిన టీఆర్ఎస్

👉 కేంద్రాన్ని ఎండగడుతున్న టీఆర్ఎస్, విపక్ష ఎంపీలు

ఢిల్లీ / ఖమ్మం , జూలై 27 :

తెలంగాణకు వరద సాయం , నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల , ద్రవ్యోల్బణం , ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం కూడా మరింత దూకుడు పెంచారు . టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు , టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలతో పాటు విపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి , కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టారు . కేంద్రం తీరుపై మండిపడ్డారు . ఎంపీల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలి .. మోదీ డౌన్ డౌన్ … కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.

allsp read- విద్యార్థిగా మారిన జిల్లా బాస్.. ఎవరంటే..?

ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబట్టినందుకు ఎంపీలను నస్పెండ్ చేయడం అన్యాయమన్నారు . వెంటనే రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు . ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేంద్రాన్ని ప్రశ్నించినందుకు ఎంపీలను సస్పెండ్ చేస్తారా అని నామ ప్రశ్నించారు . నిరసన తెలుపుతున్న రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు . న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నామ స్పష్టం చేశారు . కాగా 9 వ రోజు బుధవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన పోరాటం కొనసాగింది . ఎంపీలు ఉభయసభల్లో ప్రకార్డులు పట్టుకుని , కేంద్ర వైఖర్ని నిరశించారు . సమావేశాలు ప్రారంభంకాగానే ప్లకార్డులతో నిరసనకు దిగడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి . తిరిగి సమావేశాలు ప్రారంభమైనా అదే పరిస్థితి పునరావృతమైంది . ఈ కార్యక్రమాల్లో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ , కె.ఆర్.నరేష్ రెడ్డి , బడుగుల లింగయ్య యాదవ్ , వద్దిరాజు రవిచంద్ర , దివకొండ దామోదరరావు , బండి పార్థసారథిరెడ్డి , మన్నే శ్రీనివాసరెడ్డి , గడ్డం రంజిత్ రెడ్డి , మాలోత్ కవిత , బొర్లకుంట వెంకటేశ్ నేత , పోతుగంటి రాములు , పనుసూరి దయాకర్ తదితరులతో పాటు విపక్షాల ఎంపీలు కూడా పాల్గొన్నారు .

ఇది కూడా చదవండి : భద్రాచలం భవిష్యత్తేమిటి?