Telugu News

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మాజీ ఎంపీ విస్తృత పర్యటన

0

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మాజీ ఎంపీ విస్తృత పర్యటన
– పలు దేవాలయాల్లో విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ
– వధూవరులకు నూతన వస్త్రాల బహుకరణ
– పలు కుటుంబాలకు పరామర్శ, ఆర్ధిక సహాయం
– సర్పంచ్ ఆధ్వర్యంలో 25 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫాం అందజేత, విద్యార్ధులకు ఆర్థికసాయం

బుధవారం ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం , కొణిజర్ల, బోనకల్, వైరా, తల్లాడ, జూలూరుపాడు, సుజాతనగర్, కొత్తగూడెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించారు.

ఖమ్మం : ఖమ్మం పట్టణంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్, కేఆర్ఆర్ కళ్యాణ మండపం, లక్ష్మీ గార్డెన్స్, కన్యకాపరమేశ్వరి దేవాలయంలో జరిగిన వివాహ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం నగరంలో చనిపోయిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి మరణించిన వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పొంగులేటి వెంట కార్పోరేటర్లు మలీదు జగన్, కొప్పెర ఉపేందర్, దొడ్డా నగేష్, నగర నాయకులు తోట ప్రసాద్, భీమనాధుల అశోక్ రెడ్డి, ఒంటి కొమ్ము శ్రీనివాసరెడ్డి, మాటేటి రవి, చింతమళ్ల గురుమూర్తి, దుంపల రవికుమార్, కానుగుల రాధాకృష్ణ, పాల నాగేశ్వరరావు, తంగెళ్ల ఉపేందర్, నరసింహారావు, యువనేత గోపి తదితరులు పాల్గొన్నారు.

also read :-★ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బీజేపీ తీవ్ర అన్యాయం

కొణిజర్ల : మండలంలోని చిన్నమునగాల గ్రామంలో చెరుకుమల్లి శ్రీనివాసరావు కుమారుని వివాహ నిశ్చితార్ధ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని దంపతుల వేణు సాగరికలను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. పొంగులేటి వెంట చిన్నమునగాల గ్రామ సర్పంచ్ కాంపల్లి స్వప్న, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రాయల పుల్లయ్య, తాళ్లూరి చిన్న పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరి, ఏలూరి శ్రీనివాసరావు, కనగంటి రావు, ఉప సర్పంచ్ దమ్మాలపాటి వెంకటయ్య, పూనాటి బాబు, శీలం వెంకటరామిరెడ్డి, గుండెబోయిన నరసింహారావు, ధరావత్ రాంబాబు, బైరెడ్డి సత్యం, సనత్, తాత సతీష్, చేరుకుమల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

also read :-యువత జీవిత లక్ష్యం సాధించాలి:ఎసిపి.

బోనకల్ : బుధవారం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొంగులేటికి స్థానిక నాయకులు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పొంగులేటి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆ దేవుని చల్లని దయ మనందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోట రాంబాబు, డీసీసీబీ డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి ఎర్రుపాలెం మండల కో ఆర్డినేటర్ వెంకట్ రామ్ రెడ్డి, బోనకల్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమ్మ నేని కృష్ణ, భాగం నాగేశ్వరరావు, కన్నేటి సురేష్, సాధినేని రాంబాబు, భాగం నాగేశ్వరరావు, తమ్మారపు బ్రహ్మయ్య, తోటకూర వెంకటేశ్వరరావు, కోయినేని ప్రదీప్, జానకిపురం గ్రామ సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, రామాపురం గ్రామ సర్పంచ్ తొండపు వేణు, సండ్ర కృష్ణ, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, చిలక నాగరాజు, కటారి నాగేశ్వరరావు, చింతలచెరువు లక్ష్మీనారాయణ, ఎస్ కె మస్తాన్, దాసరి గణేష్, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం బోనకల్ మండల అధ్యక్షులు కన్నీటి సురేష్, టిఆర్ఎస్ తూటికుంట్ల గ్రామ శాఖ అధ్యక్షులు పాపినేని కృష్ణ, సాధినేని రాంబాబు, సాధినేని శ్రీనివాస రావు బోనకల్లు మండలం రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వేమూరి ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ బోనకల్ మండలం ఎస్సీ సెల్ నాయకులు కంచర్ల అచ్చయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ తూటికుంట్ల నాయకులు రైతు నాయకులు పాపినేని రామారావు, చింతకాని మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మందరపు శ్రీనివాస రావు, కొల్లి ఉపేంద్రయ్య, బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ గాదె నరోత్తమ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బైని వెంకటేశ్వర్లు, బోనకల్ మండలం నాయకులు తదితరులు నాల్గొన్నారు.

తల్లాడ: తల్లాడ సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖరరెడ్డికి పితృవియోగం..
నివాళులర్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి… తల్లాడ సహకార సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి దగ్గుల రమణారెడ్డి (60) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రమణారెడ్డి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డిని పరామర్శించి మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఓదార్చి మనో ధైర్యం కల్పించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లవరం ఉప సర్పంచ్ ఎర్రి నరసింహారావు, ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి, తల్లాడ డీసీసీబీ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, గోపాల్ రెడ్డి, అప్పిరెడ్డి, ఏమిశెట్టి నాగన్న, భద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

also read :-మహా పూజ తో నాగోబా జాతర ప్రారంభం.

వైరా: మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో సర్పంచ్ ఇటుకల మురళి తమ గ్రామంలోని ఎనిమిది మంది పేద చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు ఒక్కరికీ 5 వేల రూపాయలను వారి విద్యాభ్యాసం కొరకు మొత్తం 40 వేల రూపాయల నగదు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడి చేతులతో అందచేశారు. అదే గ్రామంలో మొత్తం 25 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ మరియు ఇన్సూరెన్స్ కొరకు 10 వేల నగదు అందచేశారు. అష్ణగుర్తి గ్రామంలో వెంపటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాలడుగు, గొల్లెనపాడు గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. పట్టణ కేంద్రంలో కొప్పురావూరి వెంకటకృష్ణ తల్లి శిరోమణి ఇటీవల మరణించగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీ కోఆప్షన్ మెంబర్ షేక్ లాలా మహమ్మద్, టౌన్ అధ్యక్షుడు ధర్నా శేఖర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అమరనేని మాధవరావు, స్థానిక సర్పంచులు ఇటుకల మురళి, శీలం రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు శీలం వెంకటరామిరెడ్డి, మత్స్య శాఖ చైర్మన్ షేక్ రహీమ్నాయకులు చల్లా సతీష్, వేమురి పుల్లారావు,ముత్తరపు డేవిడ్, వెంపటి కృష్ణ, శీలం చైతన్య రెడ్డి, ఖాసీం, వేమిరెడ్డి వెంకట కోటరెడ్డి , యారమాల రవీందర్ రెడ్డి, మడుపల్లి నాగేశ్వరరావు, కారుమంచి గోవింద్, గుమ్మ కృష్ణ మోహన్, వెంపటి నాగేశ్వరరావు, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు