Telugu News

రైతులందరికి పాసుపుస్తకాలు అందిస్తాం : కలెక్టర్

== ఎవరు చింతించాల్సిన అవసరం లేదు

0

రైతులందరికి పాసుపుస్తకాలు అందిస్తాం : కలెక్టర్
== ఎవరు చింతించాల్సిన అవసరం లేదు
== ఎర్రుపాలెం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
== రైతులతో, ప్రజలతో మాట్లాడి కరోనా సూచనలు చేసిన కలెక్టర్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని, ఎవ్వరు చింతిల్సిన పని లేదని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రుపాలెం మండల పరిధిలోని జమలాపురం గ్రామంలో రైతు వేదికలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ పెండింగ్ పాస్ పుస్తకాలు అన్నీ త్వరలోనే అందించడం జరుగుతుందని అన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలంలో ఎలక్ట్రికల్ ఏ. ఈ ని నియమించాలని కోరడంతో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

also read :-పట్టణంలో ప్రభుత్వ స్థలాల అక్రమణలపై సమగ్ర నివేదిక కావాలి==

అనంతరం కలెక్టర్ జమలాపురంలో నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వేలో పాల్గొని పలు సూచనలు చేశారు. రోడ్డు మార్గంలో జమలాపురం తండాలో కూలి పనులకు వెళ్లి వస్తున్న కూలీలతో కొంత సేపు సంభాషించి వ్యాక్సినేషన్ వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చదువును ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో ఆపి కూలి పనులకు వెళ్తున్న మనీషా ప్రభుత్వ ఖర్చుతో డిగ్రీ చదివేందుకు, నిరోష ఇంటర్మీడియట్ చదువుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు చేశారు.

ఈ కార్యక్రమంలో వైరా ఏ.సీ.పీ స్నేహమేహరా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, శిక్షణ కలెక్టర్ బి,రాహుల్, ఆర్డిఓ రవీంద్రనాథ్, సీఐ మురళి,మండల అధికారులు డాక్టర్ రాజు, ఏ.వో విజయభాస్కర్ రెడ్డి, ఎం.ఈ. ఓ ప్రభాకర్, గ్రామపంచాయతీ సర్పంచి మూల్పూరి స్వప్న, ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు, ఎం.పీ.డీ.వో అశోక్, డిప్యూటీ తాసిల్దార్ కెఎమ్ ఏ అన్సారీ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సురేష్ బాబు, అంగన్వాడీ టీచర్స్ త్రివేణి, ఏ.ఎన్.ఎం రత్నమాల తదితరులు పాల్గొన్నారు.